గర్భం దాల్చినప్పుడు ప్రారంభ దశలో శరీరంలో కనిపించే మార్పులు ఇవే..!

గర్భం దాల్చినప్పుడు ప్రారంభ దశలో శరీరంలో కనిపించే మార్పులు ఇవే..!

by kavitha

Ads

ప్రెగ్నెన్సీ వచ్చినపుడు స్త్రీల శరీరం ఎన్నో ఆకస్మికమైన మార్పులు కనిపిస్తాయి. గర్భం దాల్చిన తొలి వారంలోనే  ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ప్రతి మహిళలో ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించవు.

Video Advertisement

అయితే కొన్ని సార్లు ఇలాంటి శారీరక మార్పులు ఫ్లూ, కానీ, అపెండిసైటిస్ లేదా మోనోపాజ్ వంటివాటి వల్ల కూడా  వస్తుంటాయి. మరి  ప్రెగ్నెన్సీ సమయంలో కనిపించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మహిళా తన శరీరంలో మరో ప్రాణికి జీవం పోసే సమయం, అంటే గర్భం ధరించే సమయంలో ఆమె శరీరంలో పలు  మార్పులు కనిపిస్తుంటాయి. ఈ మార్పులు సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి స్త్రీలోను కనిపిస్తాయి. కానీ అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించాలని లేదు. గర్భధారణ మొదట్లోనే ఈ మార్పులు మొదలవుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చినపుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఇదే గర్భధారణకు ముఖ్యమైన సంకేతం. అయితే ఇతర కారణాల వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఉదయం లేవగానే వీక్ గా అనిపించడం, వికారంగా ఉండడం, తిన్న వెంటనే వాంతులు అయినట్లుగా అనిపిస్తుంది. నోటికి రుచిగా అనిపించదు. పుల్లని ఆహార పదార్ధాలు తినాలనిపిస్తుంది. మామూలు సమయంలో కన్నా ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సార్లు టాయిలెట్‌కి వెళ్తుంటారు. ప్రెగ్నెన్సీ టైమ్ లో రక్త ప్రవాహం పెరుగుతుంది. అది తలనొప్పి రావడానికి కారణమవుతుంది. ప్రెగ్నెన్సీ మొదట్లో  కనిపించే ముఖ్యమైన లక్షణాలలో ఇది కూడా ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ టెంపరేచర్ సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది.
అది మాత్రమే కాకుండా ఈ టైమ్ లో వారి మానసిక స్థితి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. చికాకు పెరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్లలో మార్పులు ప్రారంభం అవుతాయి. దానివల్ల శరీర భాగాల్లో మార్పు పెరుగుదల కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు యూరిన్ టెస్ట్ కిట్ లేదా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్  ద్వారా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఈ కిట్ సరైన ఫలితాన్ని చూపదు. డాక్టర్‌ను సంప్రదించి ప్రెగ్నెన్సీని  నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.

Also Read: రాత్రిపూట “పిక్కలు” పట్టేస్తున్నాయా.? అయితే జాగ్రత్త! మీలో ఈ మార్పులు జరుగుతుందని అర్ధం.!


End of Article

You may also like