Ads
ప్రపంచం అన్ని విషయాల్లోనూ ముందుకు వెళుతోంది. కానీ ఇప్పటికి కూడా మనుషులు అందులోనూ ముఖ్యంగా ఆడవాళ్లు ఒంటరిగా వెళ్లాలంటే భయపడుతున్నారు. అందుకు కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేరే దేశంలో రేప్ చేసిన వాళ్ళకి ఈ విధమైన శిక్షలు విధిస్తారు.
Video Advertisement
#1 నార్త్ కొరియా
నార్త్ కొరియా లో రేప్ చేసిన వాళ్లని ఫైరింగ్ స్క్వాడ్ చేత షూట్ చేయిస్తారు.
#2 రష్యా
రష్యాలో లో రేప్ చేసిన వారికి సాధారణంగా మూడు నుండి ఆరు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది. ఒకవేళ వ్యక్తికి తీవ్ర హాని కలిగిస్తే పరిస్థితిని బట్టి జైలు శిక్ష పది సంవత్సరాలకు పైగా కూడా ఉండొచ్చు. కొన్ని రేర్ కేసెస్ లో 20 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడుతుంది.
#3 ఇజ్రాయిల్
ఇజ్రాయిల్ లో 16 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. ఇక్కడ ఇతర శారీరక వేధింపులను కూడా రేప్ కిందకి పరిగణలోకి తీసుకుంటారు.
#4 ఈజిప్ట్
ఈజిప్ట్ లో రేప్ చేసిన వాళ్లకి ఉరిశిక్ష విధిస్తారు.
#5 ఫ్రాన్స్
ఫ్రాన్స్ లో 15 సంవత్సరాలు శిక్ష విధిస్తారు. బ్రుటాలిటీని బట్టి శిక్ష 30 సంవత్సరాలు లేదా జీవితకాలం ఉండొచ్చు.
#6 సౌదీ అరేబియా
ముందుగా రేప్ చేసిన వాళ్ళకి సెడేటివ్ ఇచ్చి, తరువాత బహిరంగంగా బి హెడ్ (శిరచ్ఛేదం) చేస్తారు.
#7 ఆఫ్ఘనిస్తాన్
ఆఫ్ఘనిస్థాన్ లో రేప్ చేసిన వాళ్లని కొన్ని రోజుల్లోనే చంపేస్తారు లేదా కోర్టు ఇచ్చిన తీర్పును బట్టి ఉరి తీస్తారు.
#8 ఇరాన్
ఇరాన్ లో రేప్ చేసిన వాళ్ళని అందరిముందు ఉరి తీస్తారు లేదా షూట్ చేస్తారు. రేప్ చేసిన వాళ్లని షూట్ చేయడానికి జస్టిస్ పొందడానికి విక్టిమ్స్ కి అనుమతిస్తారు. విక్టిమ్ అనుమతిస్తే రేప్ చేసిన వ్యక్తి డెత్ పెనాల్టీ నుండి తప్పించుకోవచ్చు. ఒకవేళ అలా అనుమతిస్తే రేప్ చేసిన వ్యక్తికి వంద కొరడా దెబ్బలు లేదా జీవిత ఖైదు విధిస్తారు.
#9 యుఎస్ఏ
ఇక్కడ స్టేట్ లా, ఫెడరల్ లా అని రెండు రకాల లాస్ ఉంటాయి. స్టేట్ లా ప్రకారం అయితే కొన్ని సంవత్సరాల జైలు శిక్ష, ఫెడరల్ లా ప్రకారం అయితే జీవితఖైదు శిక్ష విధిస్తారు.
#10 పాకిస్తాన్
పాకిస్తాన్ లో రేప్ చేసిన వాళ్లకి డెత్ పెనాల్టీ పడుతుంది లేదా పది నుండి ఇరవై ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. సామూహిక హింసకి పాల్పడితే డెత్ పెనాల్టీ లేదా జీవిత కాలం శిక్ష పడుతుంది.
#11 నార్వే
నార్వే లో రేప్ చేసిన వాళ్ళకి 4 నుండి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. ఇది కఠినమైన శిక్షా? అని అనిపించవచ్చు. కానీ అనుమతి లేకుండా చేసే ఎటువంటి అస్సాల్ట్ అయినా, చివరికి ముద్దు అయినా కూడా ఇదే శిక్ష ఉంటుంది. ఒకవేళ విక్టిమ్ చనిపోతే 15 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది.
#12 చైనా
చైనాలో రేప్ చేసిన వాళ్లని షూట్ చేసి చంపేస్తారు. లేదా కొన్ని కేసెస్ లో కాస్ట్రేట్ చేస్తారు.
End of Article