Ads
బయట ఎండలు మండిపోతున్నప్పుడు దాహానికి తట్టుకోలేక ఎక్కువగా మనం కూలింగ్ వాటర్ వాడుతూ ఉంటాము. ఆ నిమిషానికి ప్రాణం హాయిగా అనిపిస్తుంది కానీ అలా కూలింగ్ వాటర్ ఎక్కువగా తాగటం వలన మనం ఎన్నో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవి ఏమిటో చూద్దాం. చల్లని నీరు తాగడం వలన మీ శరీరంలోని వేడి తగ్గిపోతుందని భావిస్తారు.
Video Advertisement
కానీ అది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. మీరు ఏది తిన్నా అంత త్వరగా జీర్ణం కాదు కాబట్టి చల్లనీటికి దూరంగా ఉండండి. చల్లనీరు త్రాగటం వలన అది మీ మెదడును కూడా ప్రభావితం చేస్తుంది దాని వల్ల తలనొప్పి వస్తుంది. అంతేకాకుండా గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే చల్లని నీరు త్రాగటం వలన దాని ప్రభావం హృదయ స్పందన రేటుని ప్రభావితం చేస్తుంది. అలాగే జీర్ణాశయం కుచించుకుపోయి జీర్ణశక్తి తగ్గిపోతుంది.
చల్లని నీరు త్రాగటం వలన బ్రెయిన్ ఫ్రీజ్ సమస్య వస్తుంది. ఐస్ వాటర్ లేదంటే ఐస్ క్రీమ్ ఎక్కువగా తీసుకుంటే వెన్నెముకకి సంబంధించిన సున్నితమైన నరాలు కూడా చల్లగా అయిపోతాయి. ఫలితంగా తలనొప్పి, సైనస్ సమస్యలు వస్తాయి. అలాగే చల్లని నీరు త్రాగటం వలన పేగుల్లో ఆహారం గడ్డకడుతుంది తద్వారా మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. కడుపునొప్పి,వికారం, గ్యాస్ ట్రబుల్ లాంటివి కూడా వస్తాయి.
అలాగే చల్లని నీరు త్రాగటం వలన దంత సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే చల్లని నీరు త్రాగటం వలన నాడి వ్యవస్థ చల్లబడి హార్ట్ రేటు పల్స్ రేటు తగ్గి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. చల్లని నీరు శరీరంలో నిల్వ ఉన్న కొవ్వుని మరింత గట్టిగా తయారు చేస్తుంది ఆ గడ్డ కట్టిన కొవ్వు ఒక పట్టానా కరగదు కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు చల్ల నీటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.
End of Article