గురకకి గుండెపోటుకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

గురకకి గుండెపోటుకి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

by Mounika Singaluri

Ads

కొంతమంది విపరీతమైన గురక పెడుతూ ఉంటారు. వారి గురక వల్ల వారు ఇబ్బంది పడటమే కాకుండా పక్కన ఉన్న వారికీ కూడా నిద్రకు భంగం కలుగుతుంది. కానీ గురకని తేలిగ్గా తీసుకోకూడదని వైద్యులు వెల్లడిస్తున్నారు. విపరీతంగా గురక వస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. గురకపెట్టే వారిలో అకస్మాత్తుగా అనేకరకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Video Advertisement

 

మనం గాలి తీసుకునేటప్పుడు ఏదైనా అడ్డంకి ఎదురైతే శ్వాసనాళాల్లో ఇబ్బందిగా మారినపుడు గురక వస్తుంది. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఎక్కువగా ఈ ఇబ్బంది తలెత్తుతుంది. గురకను వైద్యపరిభాషలో స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా తో బాధపడుతున్న వారు, అనేకమార్లు నిద్ర నుండి మేల్కొంటారు. వీరు ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించలేరు.

effects of snoring related to heart

విపరీతంగా ఉన్న గురక సమస్యకు చికిత్స చేయించకుండా వదిలేస్తే ఇది గుండె జబ్బులు, మధుమేహం మరియు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలకు కారణం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

effects of snoring related to heart
కొన్ని వైద్య పరిశోధనల ప్రకారం ..గురక స్ట్రోక్ ప్రమాదాన్ని 46 శాతం పెంచుతుంది. గురక సమస్య.. స్మోకింగ్, ఆల్కహాల్‌ తాగడం వంటి చెడు అలవాట్ల కంటే కూడా గురక చాలా ప్రమాదకరం. హృదయం లోని ధమని దెబ్బతినడానికి గురక సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

effects of snoring related to heart
అంతే కాకుండా యాభై ఐదు ఏళ్లు దాటిన పురుషులు రాత్రి పూట తరచుగా మూత్ర విసర్జనకు లేస్తుంటే.. ప్రోస్టేట్ విస్తరణ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉండే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి.
విపరీతమైన గురక సమస్య ఉన్న వ్యక్తులు ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేసే అవకాశం ఉంది, ఈ పరిస్థితిలో కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు స్పందించవు. మీ కణాలు అవసరమైన విధంగా ఇన్సులిన్ తీసుకోనప్పుడు, మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది . దీంతో మీరు టైప్ 2 డయాబెటిస్‌ బాధితులుగా మారవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

effects of snoring related to heart

అధిక రక్తపోటు, అధిక ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక బ్లడ్ షుగర్ స్థాయిలు, గుండె జబ్బుల ప్రమాదం, మెటబాలిక్ సిండ్రోమ్‌ సమస్యలు స్లీప్ అప్నియాతో వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మీకు స్లీప్ అప్నియా ఉంటే, మీరు ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. విపరీతమైన గురక జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతింటుందని, గురక వల్ల నాడీ వ్యవస్థ కూడా ప్రభావితం అవుతుందని, నాడీ సంబంధిత వ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గురక సమస్యను తగ్గించాలంటే ..!!

ఎక్కువ బరువు ఉన్న వాళ్లలో కొవ్వు గొంతు భాగంలో పేరుకుపోయి గాలి తీసుకునే మార్గాన్ని చిన్నగా చేయడం వల్ల గురక వస్తుంది. అధిక బరువు సమస్య ఉంటే.. బరువు తగ్గడం మంచిది.

effects of snoring related to heart

అంతే కాకుండా వెల్లికిలా పడుకోవడం వల్ల గాలి తీసుకునే మార్గాలకు అడ్డంకి ఏర్పడి గురక వస్తుంది. అందువల్ల ఓ పక్కకు పడుకుంటే.. గురక సమస్య తగ్గుతుంది.

effects of snoring related to heart
నిద్రపోయే ముందు మద్యం తీసుకుంటే గొంతు కండరాలు విశ్రాంతి తీసుకోవడంతో గురక వస్తుంది. గురక వచ్చే వారు ఎక్కువగా నీరు తీసుకోవాలి. సరిగా నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు గురై.. ముక్కు రంధ్రాల్లో శ్లేష్మం ఏర్పడి గురక వస్తుంది.


End of Article

You may also like