లక్ష్మి దేవి మీ ఇంటికి రావాలంటే.. ఏనుగు బొమ్మను ఇలా ఉంచండి..!

లక్ష్మి దేవి మీ ఇంటికి రావాలంటే.. ఏనుగు బొమ్మను ఇలా ఉంచండి..!

by Megha Varna

Ads

చాలా మంది వాస్తుని అనుసరిస్తుంటారు. వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల మన ఇంట్లో సమస్యలు అన్ని తొలగిపోతాయి. అలానే ఆనందంగా ఉండడానికి అవుతుంది. అయితే ఇంట్లో ఏనుగు బొమ్మని ఉంచడం వల్ల చాలా మంచి కలుగుతుంది. ఎక్కువగా ఏనుగు బొమ్మ కి చైనా, జపాన్ లో ప్రాధాన్యత ఇస్తారు.

Video Advertisement

మన దేశంలో కూడా ఏనుగు కి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇంట్లో ఏనుగు బొమ్మని ఉంచడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. డబ్బులు కూడా వస్తాయి. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి.

అలానే అదృష్టం కూడా కలిసి రావడానికి సహాయం చేస్తోంది. ఏనుగు బుద్దుడికి, విఘ్నేశ్వరునికి ప్రతీక. నిజానికి ఏనుగుని ఇంట్లో ఉంచడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు. ఏనుగు బొమ్మలు మీరు కొనుగోలు చేయాలనుకుంటే తొండం పైకెత్తి ఉన్న ఏనుగు బొమ్మ ని కొనుగోలు చేయండి. ఇలాంటి వాటిని మీరు ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా ఉంచాలి.

అలా రెండు ఏనుగు బొమ్మలను మీరు ఇంటి ముఖ ద్వారానికి ఎదురుగా పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలానే పూర్తిగా నెగటివ్ ఎనర్జీ తొలగి పోతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నట్లయితే ఏనుగు బొమ్మలు ఉంచండి. దీనితో వారి మధ్య బంధం బలపడుతుంది. సమస్యలు తొలగిపోతాయి.

తల్లీ, పిల్లల మధ్య బంధం పెరగాలంటే తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంచండి. బొమ్మలైనా పెట్టచ్చు లేదంటే మీరు ఫోటో అయినా కొనుగోలు చేయవచ్చు. ఆఫీసు డోర్ ముందు కనుక ఏనుగు విగ్రహాన్ని ఉంచితే కెరియర్ బాగా డెవలప్ అవుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. కనుక ఈ విధంగా ఫాలో అయ్యి సమస్యల నుండి బయట పడండి.


End of Article

You may also like