Ads
సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలి అంటే చాలామంది కార్లనే ప్రిఫర్ చేస్తారు. అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? కార్ పేరులో LXI, VXI, ZXI అనే అక్షరాలు ఉంటాయి. వాటి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
LXI, VXI, ZXI ఎక్కువగా మారుతి వాళ్లు వాడతారట. ఈ పదాలు కార్ ఫీచర్స్ చెప్పడానికి ఉపయోగపడతాయట.
#1 LXI
ఎల్ఎక్స్ఐ (LXI) అనేది బేసిక్స్ ఫీచర్స్ ఉన్న కార్ మోడల్ ని రిప్రజెంట్ చేయడానికి ఉపయోగిస్తారట. బేసిక్ మోడల్ అంటే ఫ్రంట్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, మాన్యువల్ ఏసీ ఉన్న కార్ అని అర్థమట.
#2 VXI
విఎక్స్ఐ (VXI) అంటే మిడిల్ రేంజ్ లో ఉండే కార్స్ అట. ఎల్ఎక్స్ఐ కంటే ఇందులో ఫీచర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయట. మీడియం ఫీచర్స్ అంటే ఎయిర్ బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రేర్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, మ్యూజిక్ సిస్టం, ఫ్రంట్ ఇంకా రేర్ పవర్ విండోస్ అట.
#3 ZXI
జెడ్ఎక్స్ఐ (ZXI) అంటే హైయెస్ట్ ఫీచర్స్ ఉన్న ఖరీదైన కార్లని రిప్రజెంట్ చేస్తాయట. ఇందులో సేఫ్టీ మెజర్స్ ఎక్కువ ఉంటాయట. అంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయట. అంతేకాకుండా రేర్ డీఫాగర్, ఆటోమెటిక్ ఎయిర్ కండిషనింగ్, మొదలైనవి ఈ కార్లలో ఉంటాయట.
ఆ పదాల్లో ఎక్స్ఐ (XI) అంటే పెట్రోల్ కార్, డిఐ (DI) అంటే డీజిల్ కార్, ఎల్ (L) అంటే బేస్ మోడల్, వి (V) అంటే ఫుల్ ఆప్షన్ మోడల్, జెడ్ (Z) అంటే ఆడెడ్ ఫీచర్స్ మోడల్ అని అర్థం. ఇప్పుడు ఎల్ఎక్స్ఐ (LXI) అంటే బేస్ మోడల్ పెట్రోల్ కార్. విఎక్స్ఐ (VXI) అంటే ఫుల్ ఆప్షన్ పెట్రోల్ కార్, జెడ్ఎక్స్ఐ (ZXI) అంటే ఆడెడ్ ఫీచర్స్ పెట్రోల్ కార్ అని అర్థం. ఇవన్నీ మారుతీ కార్లకి మాత్రమే ఉపయోగిస్తారట.
ఒకవేళ హోండా కార్ లకు అయితే EMT, SMT, SVMT, VMT, VXMT, SAT, VAT, SCVT, VCVT ఇలాంటి పదాలు ఉపయోగిస్తారు. ఇందులో E, S, SV, V, VX అనేవి వేరియంట్స్ అట. ఏటీ (AT) అంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, సివిటీ (CVT) అంటే కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్. ఒకవేళ మోడల్ విసివిటీ (VCVT) అని ఉంటే అందులో వి అనేది వేరియంట్ అట. అందులో సివిటీ ట్రాన్స్మిషన్ ఉంది అని అర్థం వస్తుందట. హోండా కార్ ల లో పెట్రోల్ డీజిల్ అనేవి iVTEC , ఇంకా iDTEC సపరేట్ మార్కింగ్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తారట.
End of Article