Ads
పూర్వకాలంలో అంటే కట్టెల పొయ్యిని వాడేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం అంతా గ్యాస్ మీద వండుతున్నారు. అలానే రెస్టారెంట్ కిచెన్స్ లో బార్బిక్యూ గ్రిల్స్ వద్ద గ్యాస్ కుక్ టాప్స్ వంటి వాటిల్లో ఎల్ఫీజి సిలిండర్స్ ను ఉపయోగిస్తారు.
Video Advertisement
యూరోప్ వంటి దేశాలలో ఎల్పీజీను ఉపయోగించి వాటర్ హీటర్ ను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కొన్ని ప్రదేశాలలో ఎల్పీజీను ఉపయోగించి ఇంజన్ కు ఫ్యూయల్ గా మరియు జనరేటర్స్ కు బ్యాకప్ గా ఉపయోగిస్తారు.డీజిల్ ను స్టోర్ చేసుకోవడం కష్టమే, కాకపోతే ఎల్పీజీ డీగ్రేడ్ అవ్వకుండా స్టోర్ చేసుకోవడం సులభం.
ఎల్ఫీజి సిలిండర్స్ ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే గ్యాస్ సిలెండర్ లీక్ అయ్యేటప్పుడు ఒక వాసన వస్తుంది కదా.. అది ఎందుకు వస్తుందో తెలుసా..? ఎల్ఫీజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. చాలా మంది ఎల్పిజికు మరియు లిక్విడ్ నాచురల్ గ్యాస్ కు మధ్య కన్ఫ్యూజ్ అవుతుంటారు.
చాలా వరకు ఎల్పిజి తయారీలో ప్రొపేన్ మరియు బ్యూటేన్ ను ఉపయోగిస్తారు. అయితే సహజంగా వీటికి ఎటువంటి వాసన మరియు రంగు ఉండవు. అలాంటప్పుడు గ్యాస్ లీక్ అయితే ఎవరు గుర్తించలేరు. ఇది ఎంతో ప్రమాదకరమైన విషయమే కదా…
అందుకోసమే ఎల్ఫీజి గ్యాస్ తయారీ లో ఈథైల్ మెర్కాప్టెన్ అనే కెమికల్ ను కలుపుతారు. దాని ద్వారా గ్యాస్ యొక్క వాసన మారుతుంది. ఈ విధంగా గ్యాస్ లీక్ అయినప్పుడు మనం వాసన ద్వారా గుర్తించగలిగి, అగ్ని ప్రమాదాన్ని జరగకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతాము.
End of Article