Ads
సాధారణంగా మనం టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లిస్తూ ఉంటాం. హైవే మీద వెళ్ళినప్పుడు ఈ ఫీజు చెల్లిస్తాం. అయితే ఇలాంటి షరతులు కేవలం నేల మీద తిరిగే వాహనాలకు మాత్రమే కాదు. గాలిలో ఎగిరే ఎరోప్లేన్స్ కి కూడా ఉంటాయి. వాటిని రూట్ నావిగేషన్ ఫెసిలిటీ ఛార్జెస్ (RNFC) అని అంటారు. ప్రతి విమానం ఈ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
Video Advertisement
భారతదేశంలో ఏవియేషన్ కి సంబంధించిన విషయాలను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) చూసుకుంటుంది. ఇంక ఆర్ఎన్ఎఫ్సి (రూట్ నావిగేషన్ ఫెసిలిటీ ఛార్జెస్) విషయానికి వస్తే, వీటిని ఈ కింద చూపించిన విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు.
# ఒకవేళ ల్యాండ్ అయ్యే ఫ్లైట్స్ కి ఆర్ఎన్ఎఫ్సి క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఈ ఫార్ములా ఉపయోగిస్తారు.
RNFC = Rs.( R x D x W )
R = Rs.4620/-
D = √ (GCD/100) with GCD cap as 1200 NM
W = √ (AUW/50000) with AUW cap as 2,00,000 Kilograms
# ఒకవేళ ఓవర్ ఫ్లయింగ్ ఫ్లైట్స్ కి క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఈ ఫార్ములా ఉపయోగిస్తారు.
Rs.( R x D x W ) + Rs. 4,400/-
ఇందులో,
R అంటే సర్వీస్ యూనిట్ రేట్. 2019 – 2020 లో సర్వీస్ యూనిట్ రేట్ 5880 రూపాయలు ఉంది.
D అంటే డిస్టెన్స్ ఫ్యాక్టర్
W అంటే వెయిట్ ఫ్యాక్టర్
GCD అంటే ఒక్క నాటికల్ మైల్ (NM) కి గ్రేట్ సర్కిల్ డిస్టెన్స్
AUW అంటే ఆల్ అప్ వెయిట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ కిలో గ్రామ్స్.
# ఒకవేళ ఇండియాలో రిజిస్టర్ అయిన చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ కి క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఈ విధంగా కాలిక్యులేట్ చేస్తారు.
ఒకవేళ బరువు 10 వేల కేజీలు ఉంటే, పైన చెప్పిన వెయిట్ డిస్టెన్స్ ఫార్ములా వాడి, పది శాతాన్ని ఫీజుగా తీసుకుంటారు.
ఒకవేళ బరువు 20 వేల కేజీలు ఉంటే, అదే ఫార్ములా ఉపయోగించి, 40 శాతం మొత్తాన్ని ఫీజుగా తీసుకుంటారు.
End of Article