పావురాల ద్వారా సమాచారం పంపినప్పుడు అవి సరైన ప్రదేశానికి ఎలా చేరవేస్తాయి.?

పావురాల ద్వారా సమాచారం పంపినప్పుడు అవి సరైన ప్రదేశానికి ఎలా చేరవేస్తాయి.?

by Mohana Priya

Ads

మనం ఏదైనా చెప్పాలనుకుంటే, ఒకవేళ మనం చెప్పాలనుకున్న వ్యక్తి అక్కడ లేకపోతే మనం పాటించే పద్ధతి మెసేజ్ చేయడం. మెసేజ్ అనేది ఎన్నో వందల సంవత్సరాల నుండి మొదలైంది అన్న సంగతి మనందరికీ తెలుసు. అంతకుముందు పావురాలతో సమాచారాన్ని పంపించేవారు అనే సంగతి కూడా తెలుసు. అయితే మామూలుగా ప్రతి పావురానికి ఇలా సమాచారాన్ని తీసుకువెళ్లి, మళ్ళీ సమాచారాన్ని తీసుకువచ్చే వీలు ఉండదు.

Video Advertisement

Pigeons that were used to send messages in the olden days

వారి మెసేజ్ ని పంపడానికి పూర్వకాలంలో ఒక రకమైన పావురాలను మాత్రమే ఉపయోగించేవారు. ఆ పావురాలని హోమింగ్ పావురాలు అని అంటారు. ఈ పావురాలకు అవి ఉన్నచోటు, వాటి చుట్టూ ఉన్న చోటు చాలా బాగా తెలిసి ఉంటుంది. అవి ఎంత దూరం వెళ్ళినా సరే, మళ్ళీ తిరిగి వాటి ఇంటికి వెళ్లగలుగుతాయి.

Pigeons that were used to send messages in the olden days

 

అందుకే ఏదైనా సమాచారాన్ని పంపడం కోసం ఈ పావురాలని ఉపయోగించేవారు. ఒకవేళ ఒక రాజు దగ్గరికి వేరే రాజ్యం నుండి మెసెంజర్ (దూత) వస్తే, ఆ రాజు దగ్గర ఆ రాజ్యంలో ఉన్న పావురాలని తీసుకొని వెళ్తాడు. వాటిని ఒక పంజరంలో పెట్టుకొని తీసుకెళ్తాడు. వారి రాజు చెప్పిన విషయాన్ని ఈ పావురాలకి కట్టి పంపిస్తారు. ఈ పావురాలకి అవి ఉండే రాజ్యం తెలుసు కాబట్టి మళ్ళీ కరెక్ట్ చోటికే తీసుకువచ్చి సమాచారాన్ని అందజేస్తాయి.

Pigeons that were used to send messages in the olden days

ఇదే విధంగా 18 వ శతాబ్దంలో యుద్ధం జరిగినప్పుడు సైనికులు వారితో పాటు ఒక 10 నుండి 15 పావురాలను తీసుకువెళ్లారు. యుద్ధం ఎన్నో రోజులు జరిగేది. కాబట్టి 2-3 నెలలకు ఒకసారి ఒక పావురంతో వారి ఇంటికి వారి గురించి సమాచారాన్ని పంపించేవారు. అయితే హోమింగ్ పావురాలు అన్ని కచ్చితంగా సమాచారాన్ని అందజేస్తాయి అని చెప్పడం కష్టం.

Pigeons that were used to send messages in the olden days

 

కొన్ని పావురాలు దారి మర్చిపోయి ఆలస్యంగా సమాచారాన్ని అందజేయవచ్చు. కొన్నిటిని దారిలో గద్దలు తినేసే అవకాశాలు ఉంటాయి. అందుకే ఒకే సమాచారాన్ని రెండు మూడు పావురాలకు కట్టి పంపించేవారు. ఇప్పుడు ఈ హోమింగ్ పావురాల ఖరీదు లక్షల్లో ఉంది. ఇప్పుడు ఈ పావురాలు అంతకుముందు లాగా కాకపోయినా కూడా దగ్గర ఉన్న దారులని ఈజీగా కనుక్కుంటాయట.


End of Article

You may also like