Ads
ఒకొక్కసారి మన ఇంట్లో భోజనం అందుబాటులో ఉండకపోవచ్చు. వంట రానివారికి చేసుకోవడం కష్టమే. వంట వచ్చిన వాళ్ళకి కూడా ఒకొక్కసారి చేసుకోవడానికి ఓపిక లేకపోవచ్చు. అలాంటప్పుడు మనందరం చేసే పని ఫుడ్ ఆర్డర్ పెట్టడం. ఫోటో పెట్టాలంటే మనకి గుర్తొచ్చేవి రెండే రెండు వెబ్సైట్స్. ఒకటి స్విగ్గీ ఇంకొకటి జొమాటో. ఈ రెండింటిలో కూడా చాలామంది ప్రిఫర్ చేసేది జొమాటో.
Video Advertisement
జొమాటోలో ప్రతి రోజు ఏదో ఒక డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మెంబర్షిప్ కి తగ్గట్టు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ వల్ల ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే, రోజు మొత్తంలో ఏ టైం లో అయినా ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు. అయితే మనలో చాలా మందికి “అసలు ఇంత డిస్కౌంట్ కి ఫుడ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఏం లాభం ఉంటుంది?” అనే ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు.
అందులోనూ ముఖ్యంగా జొమాటో లో అయితే ప్రతి రెస్టారెంట్ మీద ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది. “మామూలుగా అమ్మే ధర కంటే తక్కువ డబ్బుకు అమ్మితే లాభం ఎలా వస్తుంది?” అని మనకి అనిపిస్తుంది. అసలు జొమాటో ఎలా ప్రాసెస్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.
# 2019లో జొమాటో కి వచ్చిన ఆదాయం 1397 కోట్ల రూపాయలు. జొమాటో ద్వారా ఎన్నో హోటల్స్ రెస్టారెంట్స్ తమ గురించి అడ్వర్టైజ్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. వెబ్సైట్లో ఎన్నో రెస్టారెంట్స్ గురించి అడ్వటైజ్మెంట్స్ మనం చూస్తూనే ఉంటాం.
# ఒక హోటల్ లో ఉన్నఫుడ్ ని వేరే వాళ్ళకి డెలివర్ చేసినందుకు ఆ హోటల్ నుండి జోమాటో కొంత మొత్తాన్ని తీసుకుంటుంది.
# జొమాటో లో జొమాటో ప్రో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా ఇంకా ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. ఆఫర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. అందుకే జొమాటో ప్రో మెంబర్షిప్ తీసుకునే వాళ్లు కూడా చాలా మంది ఉంటారు. ఈ జొమాటో ప్రో సబ్స్క్రిప్షన్ లో భాగం అవ్వడానికి ఎన్నో రెస్టారెంట్స్ జొమాటో కి నెలనెలా కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి.
# ఒక కొత్త రెస్టారెంట్ కి డెలివరీ గురించి, అలాగే ఎక్కడ, ఎలా రెస్టారెంట్ మొదలు పెట్టాలి అనే విషయాలపై సలహాలు ఇవ్వడానికి కూడా జొమాటో యాజమాన్యం కన్సల్టింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తారు.
# ఇవి మాత్రమే కాకుండా ఈవెంట్స్ కి, అలాగే ఫుడ్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కి జోమాటో ద్వారా టికెట్స్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తారు. దీని ద్వారా జొమాటో కి కొంత మొత్తం కమిషన్ గా వస్తుంది.
ఇలా జోమాటో ప్రాసెస్ అవుతుంది.
End of Article