రహదారిపై ఉండే మైలు రాళ్లను ఎప్పుడైనా గమనించారా? ఏ రంగుకి అర్ధం ఏంటంటే?

రహదారిపై ఉండే మైలు రాళ్లను ఎప్పుడైనా గమనించారా? ఏ రంగుకి అర్ధం ఏంటంటే?

by Mohana Priya

సాధారణంగా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మైల్ స్టోన్స్ చూసే ఉంటాం. రోడ్డు మీద ఒక పక్కకి ఒక రాయి మీద ఆ ఊరి పేరు, లేదా ఆ ప్రదేశం పేరు రాసి ఉంటుంది. అలాగే కిలోమీటర్ల నంబర్లు కూడా వేసి ఉంటాయి. ఇది అందరం గమనించే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా ఇంకొక విషయం గమనించారా? అదేంటంటే, మైల్ స్టోన్స్ అనేవి రెండు రంగుల్లో ఉంటాయి.

Video Advertisement

సగానికి పైగా తెలుపురంగు ఉంటే, పైన ఉండే పార్ట్ మాత్రం వేరే రంగులో ఉంటుంది. తెలుపు రంగు అనేది అన్ని మైల్ స్టోన్స్ కి కామన్ గా ఉంటుంది. కానీ తెలుపు రంగుకి కాంబినేషన్ గా వచ్చే రంగు మాత్రం మారుతుంది. అలా మైల్ స్టోన్స్ వేరే వేరే రంగుల్లో ఉండటానికి గల కారణం ఏంటి అంటే.

మైల్ స్టోన్స్ మీద తెలుపు తో పాటుగా ఉండే వేరే రంగు ఆ ప్రదేశాన్ని ఇండికేట్ చేస్తుందట. అంటే ఒకవేళ మీరు ఉన్న ప్రదేశంలో మైల్ స్టోన్ ఎల్లో కలర్ లో ఉంటే మీరు నేషనల్ హైవే మీద ఉన్నారు అని అర్థం.

ఒకవేళ మైల్ స్టోన్ గ్రీన్ కలర్ లో ఉంటే మీరు స్టేట్ హైవే మీద ఉన్నారు అని అర్థం.

ఒకవేళ మైల్ స్టోన్ బ్లాక్, బ్లూ లేదా వైట్ కలర్ లో ఉంది అంటే మీరు సిటీ  లేదా డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయ్యారు అని అర్థం. అంతేకాకుండా ఆ రోడ్ల మెయింటెనెన్స్ ఆ డిస్ట్రిక్ట్ పరిధిలోకి వస్తుంది లేదా ఆ రోడ్ల మెయింటెనెన్స్ ని కేవలం ఆ సిటీ (సేమ్ సిటీ) అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది అని అర్థమట.

ఒకవేళ మైల్ స్టోన్ రెడ్ కలర్ లో ఉంటే మీరు రూరల్ రోడ్ లో ప్రయాణిస్తున్నారు అని అర్థం. ఈ రోడ్లు ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన కిందకి వస్తాయట. ఈ విషయం మీలో చాలామంది గమనించే ఉంటారు. ఒకవేళ లేకపోతే మళ్లీ ఎప్పుడైనా ఈసారి మైల్ స్టోన్ చూసినప్పుడు అబ్జర్వ్ చేయండి. అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం ఎక్కడ ఉన్నామో అని కన్ఫ్యూజ్ అయినప్పుడు ఈ మైల్ స్టోన్స్ చూసి తెలుసుకోవచ్చు.


You may also like