మనం తరచుగా కార్ వాడుతూనే ఉంటాం. మీరు ఎప్పుడైనా గమనించారా? కార్ విండ్ స్క్రీన్ మీద నలుపు రంగులో చుక్కలు ఉంటాయి. దాదాపు ప్రతి కార్ మీద ఇలాగే ఉంటాయి. అవి ఏంటో మీకు తెలుసా? ఇది గమనించిన చాలా మందికి ఒక అనుమానం వస్తుంది. అసలు అలా చుక్కలు ఎందుకు ఉంటాయి అని. కానీ అలా చిన్న చిన్న వాటికి కూడా మనకి తెలియకుండా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.

ఆ బ్లాక్ డాట్స్ ని ఫ్రిట్స్ అంటారు. కారు మాన్యుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు బ్లాక్ ఎనామిల్ తో ఒక పెద్ద బోర్డర్ లైన్ ప్రింట్ చేస్తారు. అది బేక్ అయిన తర్వాత చివరిలో చిన్న చిన్న చుక్కలుగా డిసాల్వ్ అవుతుంది. ఫ్రిట్స్ విండో గ్లాస్ సరిగా ఉండడానికి.. అంటే కదలకుండా ఉండడానికి ఉపయోగపడతాయట. అంతేకాకుండా విండ్ షీల్డ్ బాండింగ్ ఉండడానికి, అలాగే యువి రేడియేషన్ వల్ల బ్యాండ్ కి ఉన్న జిగురు (అడెసివ్) కరిగిపోకుండా ఉండటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి.

ఒకవేళ విండ్ షీల్డ్ మార్చాలన్నా, లేకపోతే రిపేర్ చేయాలన్నా ఫ్రిట్స్ ని గ్లాస్ కి, ఫ్రేమ్ కి మధ్య బాండింగ్ పాయింట్ లాగా వాడతారట. ఫ్రిట్స్ వల్ల అప్పియరెన్స్ పాలిష్డ్ గా ఉంటుందట. ఈ బ్లాక్ డాట్స్ టెంపరేచర్ సమానంగా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయట.