ట్రైన్ బోగీల మీద ఉండే తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగు గీతలకు అర్థం ఏంటో తెలుసా..?

ట్రైన్ బోగీల మీద ఉండే తెలుపు, పసుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగు గీతలకు అర్థం ఏంటో తెలుసా..?

by Mohana Priya

Ads

జనాలు ఎక్కువ బస్సు ప్రయాణాల కంటే ట్రైన్ ప్రయాణం ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిసరాలు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. జన సందోహం ఉన్న ప్రదేశాలలో ట్రైన్ వెళ్లదు కాబట్టి వాతావరణం కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది. అలా మనం మనం ట్రైన్ ఎక్కినప్పుడు మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూ ట్రైన్ ని ఎక్కువ గమనించము. మన బెర్త్ తప్ప మిగిలినవి మనం పట్టించుకోము.

Video Advertisement

అలా ట్రైన్ ల మీద ఉన్న గీతలను మనం గమనించే ఉంటాం. కానీ అలా ట్రైన్ మీద గీతలు ఉండడానికి ఒక కారణం ఉందని చాలా మందికి తెలిసి ఉండదు. ట్రైన్ మీద పసుపు, తెలుపు, గ్రీన్ రంగుల్లో గీతలు ఉంటాయి. అలా గీతలు ఉండడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

#బ్లూ కలర్ ఐసిఎఫ్ కోచ్ మీద తెలుపు రంగు గీతలు

బ్లూ కలర్ ఐసిఎఫ్ కోచ్ మీద తెలుపు రంగు గీతలు ఉంటే, అది జనరల్ కోచ్ అని సూచిస్తుంది. అందులో సీట్లు రిజర్వ్ చేసి లేవు అని, అందులో ఎవరైనా ప్రయాణించవచ్చు అని ఆ గీతల అర్థం.

stripes on railway coach

#కోచ్ మీద పసుపు రంగు గీతలు

ఒకవేళ కోచ్ మీద పసుపు రంగు గీతలు అది ఉంటే దివ్యాంగులకి లేదా అనారోగ్యంతో ఉన్న వారికి అని అర్థం.

stripes on railway coach

#గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ గీతలు

గ్రే కలర్ మీద గ్రీన్ కలర్ గీతలు ఉంటే అది కేవలం మహిళలకు మాత్రమే అని అర్థం.

 

#గ్రే కలర్ మీద ఎరుపు రంగు గీతలు

ఈఎంయు (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), లేదా ఎంఈఎంయు (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) ట్రైన్ పై గ్రే కలర్ మీద ఎరుపు రంగు గీతలు ఉంటే అది లోకల్ ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ అని అర్థం.

 


End of Article

You may also like