Ads
ఒక మనిషి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని రోజులు వారు చదువుకున్న రోజులు. స్కూల్, కాలేజ్ ఇలా చదువుకున్న రోజులు అన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మెమరబుల్ గా ఉంటాయి. ఎంతో మందికి ఇప్పటికీ కూడా బెస్ట్ మెమొరీస్ అంటే చదువుకునే రోజుల్లోనే ఉంటాయి. అందులోనూ ముఖ్యంగా స్కూల్ డేస్ లో అయితే చాలా జ్ఞాపకాలు ఉంటాయి. స్కూల్ లో ఫేర్వెల్ లో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు.
Video Advertisement
ఒక్క ఫేర్వెల్ మాత్రమే కాకుండా స్కూల్ లాస్ట్ డేస్ లో అందరూ గొడవలలాంటివేమి పడకుండా చాలా స్నేహంగా ఉంటారు. తర్వాత మళ్ళీ కలుస్తారో, కలవరో తెలియదు కాబట్టి పాత విషయాలన్నీ మర్చిపోయి ఆనందంగా గడుపుతారు. స్కూల్ చివరిలో వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు వారి ఫ్రెండ్స్ తో, తర్వాత కాలేజ్ కి వెళ్ళినా లేదా ఇంకెక్కడికైనా వెళ్లిపోయినా కూడా వారితో తరచుగా మాట్లాడుతూ ఉంటాము అనే ప్రామిస్ చేసే ఉంటారు.
ఈ ప్రామిస్ నిలబెట్టుకోవడం చాలా కష్టం అని అప్పుడు మనకి తెలియదు. “ఏముంది రోజులో ఒక్కసారి మన ఫ్రెండ్ తో మాట్లాడడమే కదా?” అని అనిపిస్తుంది. కానీ సమయం గడిచే కొద్దీ మనకి ఈ విషయం అర్థమవుతుంది. మన పనుల్లో మనం పడిపోతాం. మనకి కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దాంతో పాత వారితో, అది కూడా మనకి దూరంగా ఉన్న వారితో తరచుగా మాట్లాడటం కష్టమవుతుంది.
అలా అని మన పాత ఫ్రెండ్స్ అంటే మనకి ఇష్టం లేక కాదు. మనం మన పాత ఫ్రెండ్స్ ని కూడా ఎప్పటి లాగానే ఇష్టపడతాం. కానీ రోజు మాట్లాడడం అనేది కుదరదు. ఎందుకంటే మన బ్రెయిన్ మనం రోజు కలిసే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో కానీ, లేదా మనతో చదువుకున్న వారిలో ఒకరో, ఇద్దరో మనకి దగ్గరగా ఉంటే వారితో మనం ఎక్కువగా సమయం గడుపుతాం. దాంతో పాటు మిగితా పనుల్లో బిజీ అయిపోతాం.
NOTE: All the Images used are only for representative purpose.
End of Article