ప్రయాణాలు అంటే ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా. ప్రపంచంలో ఎంతో మంది ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. ఎంతో మంది పని విషయంలో ప్రయాణిస్తారు, ఇంకా కొంత మంది వేరే ఏదైనా కారణంగా ప్రయాణాలు చేస్తారు, ఇంకా కొంత మంది వేరే ప్రదేశాలను చూడటానికి వెళ్తూ ఉంటారు. కానీ దాదాపు అందరు ప్రయాణాలు అయితే కచ్చితంగా చేస్తారు.

Ever wondered why train and flight have blue colour seats

మనం ఒక చోటు నుండి వేరే చోటుకు ప్రయాణించడానికి ఎన్నో రకాల వెహికల్స్ ఉన్నాయి. అందులో మనందరం ఎక్కువగా వాడేది బస్, ట్రైన్, లేకపోతే ఫ్లైట్. ఇందులో చాలా మంది ట్రైన్ ప్రయాణాలను ఫ్లైట్ ప్రయాణాల ని ఇష్టపడతారు. అయితే బస్ లో కానీ, ట్రైన్ లో కానీ ఫ్లైట్ లో కానీ ప్రయాణించేటప్పుడు మనం చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ ఉంటాం కానీ మనం కూర్చున్న బస్ ని కానీ, ట్రైన్ ని కానీ ఫ్లైట్ ని కానీ ఎక్కువగా పట్టించుకోము.

Ever wondered why train and flight have blue colour seats

ఒకసారి మనం ఎప్పుడైనా గమనిస్తే బస్, ట్రైన్, ఫ్లైట్ లో సీట్లు బ్లూ కలర్ లో ఉంటాయి. దాదాపు ప్రతి బస్ లో, ప్రతి ట్రైన్ లో ప్రతి ఫ్లైట్ లో సీట్ బ్లూ కలర్ లోనే ఉంటాయి. అలా ఉండడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే. సాధారణంగా ఒక మనిషి మెదడు ఒక్కొక్క రంగు చూస్తే ఒక్కొక్కలాగా స్పందిస్తుంది.

Ever wondered why train and flight have blue colour seats

ఎరుపు చూస్తే డేంజర్ అని, తెలుపు చూస్తే శాంతి అని అలా ఒక్కొక్క రంగుని చూస్తే మనిషి మెదడు ఒక్కొక్కలాగా స్పందిస్తుంది. అలా మనం ప్రయాణాల్లో ఎక్కువసేపు కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి మధ్యలో వచ్చే విసుగు అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు బ్లూ కలర్ ఒక మనిషి మెదడు ని కామ్ చేస్తుంది.

Ever wondered why train and flight have blue colour seats

బ్లూ కలర్ విసుగు, చిరాకు లాంటి ఫీలింగ్స్ ని పోగొట్టి మనల్ని రిలాక్స్డ్ గా ఉండేలా చేస్తుంది. అందుకే బస్, ఫ్లైట్ ట్రైన్ లో సీట్లు బ్లూ కలర్ లో ఉంటాయి. ఈసారి బస్, ట్రైన్ లేదా ఫ్లైట్లో ప్రయాణించేటప్పుడు మీరు కూడా ఈ విషయాన్ని గమనించండి. కేవలం బస్, ట్రైన్, ఫ్లైట్లో మాత్రమే కాకుండా జపాన్ లో అయితే స్ట్రీట్ లైట్లు కూడా బ్లూ కలర్ లోనే ఉంటాయట.

Ever wondered why train and flight have blue colour seats