Ads
ప్రముఖులు ఎక్కడికి వెళ్లినా కూడా వాళ్ళకి సెక్యూరిటీ కచ్చితంగా ఉంటారు. అయితే సెక్యూరిటీ లో కూడా క్యాటగిరీస్ ఉంటాయట. అలా మన భారతదేశంలో ఉన్న సెక్యూరిటీ క్యాటగిరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
#1 ఎస్ పి జి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ఒక స్పెషల్ ఆపరేషన్ ఫోర్స్. వీళ్లు భారతదేశ ప్రైమ్ మినిస్టర్ కి అలాగే ప్రైమ్ మినిస్టర్ యొక్క కుటుంబ సభ్యులకు (ఇమిడియట్ ఫ్యామిలీ) కి ప్రొటెక్షన్ అందిస్తారు. ఇది 1988లో పార్లిమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పడింది. ప్రస్తుతం కేవలం ఆరుగురికి మాత్రమే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ రక్షణని అందిస్తున్నారట.
#2 జెడ్ ప్లస్ (Z+)
ఎస్ పి జి తర్వాత హై లెవెల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇదే. ఇందులో మొత్తం 55 మంది ఉంటారట. వాళ్లలో పదిమంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఎన్ఎస్జీ ఇంకా పోలీస్ పర్సనల్ ఉంటారట.
#3 జెడ్ (Z)
భారతదేశంలో మూడవ హైలెవల్ సెక్యూరిటీ ఇదే. ఇందులో 22 మంది ఉండగా, వాళ్లలో నలుగురు లేదా ఐదుగురు ఎన్ ఎస్ జి కమాండోస్ ఇంకా పోలీస్ పర్సనల్ ఉంటారట. జెడ్ క్యాటగిరి సెక్యూరిటీ అందుకునే వాళ్ళలో బాబా రాందేవ్, అమీర్ ఖాన్ అన్నారు.
#4 వై (Y)
ఇందులో 11 మంది ఉంటారు. వాళ్లలో ఒకరు లేదా ఇద్దరు, ఎన్ ఎస్ జి కమాండోస్ ఇంకా పోలీస్ పర్సనల్ ఉంటారు. ఇందులో ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ని ప్రొవైడ్ చేసే సదుపాయం కూడా ఉందట. వై క్యాటగిరి సెక్యూరిటీ అందుకునే వాళ్ళు భారత దేశంలో చాలా మంది ఉన్నారు.
#5 ఎక్స్ (X)
ఇందులో ఇద్దరు సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. ఎక్స్ క్యాటగిరి లో కమాండోస్ ఉండరట. కేవలం ఆర్మ్డ్ పోలీస్ పర్సనల్ ఉంటారట.
End of Article