ఇవివి గారి క్రియేటివిటీ మాములుగా లేదుగా… ఈ టైటిల్ కార్డ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

ఇవివి గారి క్రియేటివిటీ మాములుగా లేదుగా… ఈ టైటిల్ కార్డ్స్ చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

by Anudeep

Ads

ఇవివి గారు అంటే.. ఇవివి సత్యనారాయణ గారు. ఈదర వీర వెంకట సత్యనారాయణ అని ఆయన పూర్తి పేరు. కానీ మన సినిమా అభిమానులకు మాత్రం ఆయన ఇవివి గారే. ఆయన దర్శకుడు మాత్రమే కాదు.. స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ గా కూడా పని చేసారు. ఆయన సినిమాలు వైవిధ్యం గా ఉండేవి. ఆయన సినిమాల్లో కూడా ఆయన స్టైల్ కొట్టొచ్చినట్లు కనపడేది.

Video Advertisement

evv 1

కామెడీ సినిమాలు తీయడం లో ఆయన దిట్ట. జంధ్యాల హాస్యం ఎంత బాగుంటుందో ఇవివి గారి కామెడీ సినిమాలు కూడా అంతే బాగుంటాయి. ఇప్పుడు వచ్చే కుళ్ళు కామెడీ సినిమాల కంటే ఇవివి గారి సినిమాలు ఎక్కువ నవ్విస్తాయి. నవ్విస్తూ ఏడిపిస్తాయి. మనసుకు హత్తుకుంటాయి. వెస్ట్ గోదావరి ప్రాంత వాసుడు ఐన ఇవివి స్వతహాగానే సరదా మనిషి. ఆయన జంధ్యాల వద్దే ఎనిమిది సంవత్సరాల పాటు శిష్యరికం చేసారు. 1990 లో “చెవిలో పువ్వు” సినిమా తో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.

evv 2

దాదాపు యాభై ఒక్క సినిమాలకు దర్శకత్వం వహించారు. సినిమాలను చాలా భిన్నం గా, నవ్విస్తూ తీయడం లో ఇవివి గారు దిట్ట. కితకితలు సినిమా గుర్తుంది కదా.. ఆయన సినిమాలు వచ్చి ఎన్నేళ్ళయ్యినా.. మనం ఇప్పటికి చూసి నవ్వుకుంటూనే ఉంటాం. అదీ ఆయన గొప్పతనం. ఎక్కడిదాకానో ఎందుకు.. ఆయన టైటిల్స్ కార్డ్స్ వేయడం లో కూడా అప్పట్లోనే చాలా డిఫరెంట్ గా ఆలోచించారు. ఈ కింద వీడియో చూడండి.. మీరు నవ్వకుండా.. ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేరు..

watch video:

https://youtu.be/FHhkl6jdsN8?t=19


End of Article

You may also like