ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో ట్రై చేయండి.! ఆ ఇద్దరు స్నేహితులు ట్రైన్ మిస్ అయ్యారు..తర్వాత.?

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరేమో ట్రై చేయండి.! ఆ ఇద్దరు స్నేహితులు ట్రైన్ మిస్ అయ్యారు..తర్వాత.?

by Mohana Priya

Ads

ప్రతి మనిషి ఒకేలాగా ఆలోచించలేరు. అంటే కొన్ని సందర్భాల్లో ఒక మనిషి ఆలోచన సందర్భానికి తగ్గట్టుగా మారుతుంది. అందుకు ఇప్పుడు మీరు చదవబోయే సంఘటనే ఉదాహరణ. ఒకవేళ మీరు ట్రైన్ ప్రయాణం చేయాల్సి ఉంది. ట్రైన్ 10 గంటలకు ఉంది. మీరు మీ ఇంటి నుండి రైల్వే స్టేషన్ కి తొమ్మిది గంటలకి బయలుదేరారు. మీ ఇంటి నుండి రైల్వే స్టేషన్ కి అరగంట ప్రయాణం.

Video Advertisement

కానీ ఉదయం సమయం కావడంతో ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది. దాంతో మీరు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయారు. ట్రాఫిక్ జామ్ నుండి వెహికల్స్ కదలడానికి 45 నిమిషాలు పట్టింది. తర్వాత కూడా రోడ్లు బిజీగా ఉండడం వల్ల మీరు రైల్వే స్టేషన్ కి అరగంట ఆలస్యంగా చేరుకున్నారు. ట్రైన్ 10 గంటలకు వెళ్ళిపోయింది. దాంతో మీరు మీ ట్రైన్ మిస్ అయ్యారు.

Example for counterfactual thinking

ఇప్పుడు ఇంకొక సినారియో  చూద్దాం. పైన చెప్పిన విధంగానే మీ ఫ్రెండ్ కి కూడా పది గంటలకి ట్రైన్ ఉంది. అలాగే మీ ఫ్రెండ్ 9 గంటలకు తన ఇంటి నుండి బయలుదేరారు. ట్రాఫిక్ జామ్ వల్ల మీ ఫ్రెండ్ రైల్వే స్టేషన్ కి చేరుకోవడం ఆలస్యం అయ్యింది. మీ ఫ్రెండ్ రైల్వే స్టేషన్ కి అరగంట ఆలస్యంగా చేరుకున్నారు. దాంతో మీ ఫ్రెండ్ ట్రైన్ మిస్ అయ్యింది. అయితే ఈసారి మాత్రం ట్రైన్ 10:25 కి స్టార్ట్ అయ్యింది.

Example for counterfactual thinking

రెండవ సందర్భంలో మాత్రం “మీ ఫ్రెండ్ ఒక ఐదు నిమిషాలు ముందు వచ్చి ఉంటే సరిపోయేది కదా?” అనిపిస్తుంది. ముందు చెప్పిన సందర్భంలో అరగంట లేట్ అయింది కాబట్టి ఇంత ఆలోచించక పోవచ్చు. కానీ రెండో సందర్భంలో కేవలం ఐదు నిమిషాలు కాబట్టి,మీ ఫ్రెండ్ ఇంటి నుండి కొంచెం ముందు బయలుదేరి ఉంటే ఇక్కడికి కనీసం ఒక పది నిమిషాలు ముందు అయినా చేరుకునే వాళ్ళు అని, ట్రైన్ స్టార్ట్ అయ్యే టైం కి రైల్వే స్టేషన్ లో ఉండే వాళ్ళు అని, దాంతో ట్రైన్ అందేది అని అనుకునేవాళ్ళు.

Example for counterfactual thinking

ఒకవేళ కొంచెం ముందు బయలుదేరితే ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కునే వాళ్ళం కాదు అని, దాంతో లేట్ అయ్యేది కాదు అని అనుకుంటారు. సందర్భానికి తగ్గట్టుగా ఆలోచన మారుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. రెండవ సందర్భంలో మనం ఆలోచించే విధానాన్ని కౌంటర్ ఫాక్చువల్ థింకింగ్ అని అంటారు.


End of Article

You may also like