ISHA AMBANI: అంబానీ కూతురుకి మాత్రమే సొంతమైన ఈ 3 అత్యంత ఖరీదైన వస్తువులు ఏంటో తెలుసా?

ISHA AMBANI: అంబానీ కూతురుకి మాత్రమే సొంతమైన ఈ 3 అత్యంత ఖరీదైన వస్తువులు ఏంటో తెలుసా?

by Harika

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఒకే విషయం గురించి చర్చ జరుగుతోంది. భారతదేశం అంతా కూడా జాంనగర్ వైపే చూస్తోంది. భారతదేశంలోనే. కాదు కాదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ పెళ్లికి ముందు జరిగే వేడుకలు గుజరాత్ లోని జాంనగర్ లో అంగరంగ వైభవంగా చేస్తున్నారు.

Video Advertisement

అంబానీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అంటేనే బాలీవుడ్ అంతా కూడా అక్కడే ఉంటుంది. అలాంటిది అంబానీ ఇంట్లో పెళ్లి అంటే బాలీవుడ్ ఏంటి. హాలీవుడ్ వాళ్లు కూడా ఉన్నారు. సినిమా వాళ్లు, రాజకీయాలకు చెందిన వాళ్లు, వ్యాపారవేత్తలు, క్రీడారంగానికి చెందినవారు, ఇలా ప్రతి రంగంలోని ప్రముఖులు కూడా ఈ వేడుకకి హాజరు అవుతున్నారు.

shloka mehta got the the world's costliest diamond neck piece..!

అంబానీ వారి మర్యాదల్లో కూడా ఎక్కడా లోటు రాకుండా చూసుకుంటున్నారు. ఫోటోగ్రాఫర్స్ బయట ఎక్కువ సేపు అంబానీ కుటుంబం కోసం వేచి చూసి, అక్కడికి వస్తున్న ప్రముఖుల గురించి సంబంధించిన విషయాలు అన్నీ కూడా కవర్ చేస్తున్నారు. వారు కూడా అలసిపోవద్దు అని ఉద్దేశంతో, వారి కోసం ఒక స్పెషల్ మీల్, తాగడానికి పానీయాలు, పండ్లు, స్వీట్లు వంటివి పంపించారు. ఇంక వేడుకల్లో అయితే దాదాపు 2000 రకాల వంటలు ఉన్నాయి అని సమాచారం. అంబానీ ఇంట్లో పెళ్లి అంటే ఖర్చు కూడా మామూలుగా ఉండదు కదా.

cost of anant ambani wedding

2018లో అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లి జరిగింది.ఆమె పెళ్లి కోసం 700 కోట్లు ఖర్చు పెట్టారు. పెళ్లిలో ఇషా అంబానీ 90 కోట్ల విలువైన లెహంగాని ధరించారు. వాలంటీనో అనే అంతర్జాతీయ దుస్తుల బ్రాండ్ ఇషా అంబానీ కోసం మొదటి సారి ప్రత్యేకంగా ఇండియన్ డిజైనర్ లెహంగాని తయారు చేశారు. ఈశా అంబానీ పెళ్లి అజయ్‌ పిరమాల్‌ తనయుడు ఆనంద్‌ పిరమాల్‌తో జరిగింది. గత సంవత్సరం అంబానీ కూతురు కవలలకు జన్మనిచ్చారు. ఇషా, ఆనంద్‌ ల పిల్లలకు అదియా, కృష్ణలుగా పేర్లు పెట్టారు. ఇది ఇలా ఉంటె… ఇషా, ఆనంద్‌ ల జంట దగ్గర ఉన్న అత్యంత ఖరీదైన వస్తువులు ఏంటో ఓ లుక్ వేయండి.

#1. గులిటాలోని 450 కోట్ల విలువగల మాన్షన్

5000 చదరపు అడుగుల ఈ భవనం ఖరీదు 450 కోట్లు. అయిదు అంతస్తుల ఈ బంగ్లాలో అత్యాధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. లివింగ్ రూమ్, ఓపెన్ స్పేస్, డైనింగ్, మల్టీ పర్పస్ రూమ్ ఇలా ఒకో ఫ్లోర్ లో ఒకోటి.

#2.  90 కోట్లు విలువ చేసే పెళ్లి చీర

సెలబ్రిటీస్ పెళ్లిళ్లలో ఇషా అంబానీ పెళ్లి చాలా హైలైట్. పెళ్లికి ఆమె ధరించిన చీర ఖరీదు 90 కోట్లు.

#3. 10 కోట్లు విలువ చేసే కార్

ఇషా అంబానీ మరియు ఆనంద్ పిరమల్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన కార్లలో “మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ గార్డ్” ఒకటి. ఈ కారుని 2015 లో వీరు కొన్నారు. దీని ఖరీదు అప్పట్లోనే 10 కోట్లు. 523 bhp మరియు 829 Nm టార్క్ యొక్క గరిష్ట శక్తిని అందించే 12-సిలిండర్ V షేప్ ఇంజన్‌తో ఆధారితమైన ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇతర ఆధునిక సౌకర్యాలను కూడా కలిగి ఉంది.

ALSO READ: అంబానీ ఇంట పెళ్లికి ఇన్ని కోట్లు ఎందుకు వేస్ట్ అనుకుంటున్నారా.? ఇది ఆలోచించండి.! 

 

 


End of Article

You may also like