Ads
విదుర నీతి గురించి అందరికి తెలిసే ఉంటుంది.. విదురుడు ధర్మనీతి పరాయణుడు. ఏది ధర్మమో.. ఏది అధర్మమో చెప్పాలంటే ఆయన తరువాతే ఎవరైనా.. విదురుడు ఎవరో తెలుసా..? ధృతరాష్ట్రుడు, పాండురాజుల తమ్ముడే విదురుడు. కౌరవసామ్రాజ్యానికి సంరక్షకుడిగా ఉన్న విదురుడు రాజ్య క్షేమం కోసం ఎంతగానో కృషి చేసాడు. అలాంటి విదురుడు ఎవరిని అదృష్టవంతులు అంటారో.. ఎలాంటి లక్షణాలు ఉన్నవారిని అదృష్టవంతులు అంటారో వివరం గా చెప్పాడు. ఆయన ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
Video Advertisement
# నిత్యం ఏవో ఒక అనారోగ్యం తో బాధపడేవారు ఎంతో దురదృష్టవంతులట. అనారోగ్యం వలన ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా పరిపూర్ణ ఆరోగ్యం తో ఉండేవాడే అదృష్టవంతుడు అని విదురుడు తెలిపాడు.
#సున్నితమైన మనసు తో, ప్రశాంతం గా ఉండి మధురమైన మాటలు మాట్లాడగలిగేవారు అదృష్టవంతులని విదురుడు తెలిపాడు.
# పెద్దలను గౌరవిస్తూ.. వినయ విధేయతలు కలిగి ఉండే పిల్లలు కలవారు కూడా ఎంతో అదృష్టవంతులు విదురుడు చెప్పాడు. అలాంటి పిల్లలు తమకు, తమ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారట.
#బాగా చదువుకుని, మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే వారి జ్ఞానం వారికి జీవితం లో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది.
#అలాగే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం గా ధనం సంపాదించగలిగిన వారు కూడా అదృష్టవంతులే. ఎందుకంటే ధనం ఉంటేనే జీవితం లో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళగలం.
#భార్య భర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోగలిగిన వారు కూడా అదృష్టవంతులేనట. ఎలాంటి కలహాలు లేకుండా భార్య/భర్త ఉండడం వలన జీవితం ప్రశాంతం గా ఉంటుంది.
End of Article