Ads
తల్లిదండ్రులు సంపాదించినటు వంటి ఆస్తిలో సాధారణంగా పిల్లలకు హక్కు ఉంటుందనే విషయం తెలిసిందే. కుటుంబ యజమాని తన ఫ్యామిలీలోని పిల్లలకి ఆస్తిని సమానంగా పంచుతూ వీలునామ రాస్తారు. ఎందుకంటే తమ తదనంతరం వారి పిల్లల మధ్య ఆస్తుల కోసం ఎలాంటి తగాదాలు పెట్టుకోకూడదనే ఉద్దేశ్యంతో సాధారణంగా వీలునామా రాస్తుంటారు.
Video Advertisement
అయితే ఒక భర్త ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే, అతని ఆస్తిలో భార్యకు, కుమారుడికి మరియు కూతురుకి ఎంత వాటా వస్తుంది. ఒకవేళ ఆ పిల్లలు తల్లికి ఆస్తిని ఇవ్వకుంటే అప్పుడు ఆమె పరిస్థితి ఏమిటీ? ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
డబ్బు చాలా శక్తివంతమైనది. డబ్బు వల్ల సంబంధాలు విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. ఒక మనిషి వీలునామా రాయకుండా మరణిస్తే కుటుంబ సభ్యులు ఆస్తిలో ఎవరికి ఎంత వాటా వస్తుంది అనే విషయం పై తగాదాలు పడుతుంటారు. చాలా సార్లు ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆస్తుల కోసం ఎప్పుడు ఊహించని వ్యక్తులు కూడా ఆస్తిలో తమకు వాటా ఉందంటూ తెరపైకి రావచ్చు. అలాంటి వాటికి హిందూ వారసత్వ చట్టం 1956 సమాధానం చెబుతుంది.
హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారంగా ఒక వ్యక్తి సంపాదించిన ఆస్తి పై అతని భార్యకు, పిల్లలకు హక్కు ఉంటుంది. వీరిని షెడ్యూల్‌లోని క్లాస్-1 గా పరిగణిస్తారు. అంటే ఒక వ్యక్తి ఎలాంటి వీలునామాను రాయకుండా చనిపోతే, భార్యకు, పిల్లలు అతని ఆస్తికి సమాన హక్కుదారులు అవుతారు. అంటే ఒక వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉండి, అతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండి, అతను వీలునామా రాయకుండా మరణించినట్లయితే షెడ్యూల్‌లోని క్లాస్-1వర్తిస్తుంది. షెడ్యూల్‌లోని క్లాస్-1 ప్రకారం భార్య, కుమారులు, కుమార్తెల అందరికి సమానంగా పంపిణీ చేయబడుతుంది. అలా భార్యకు 2 ఎకరాలు, కుమారులకు, కుమార్తెలకు ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున ఇవ్వబడుతుంది. ఒకవేళ ఆ వ్యక్తి పిల్లలు తల్లికి వాటా ఇవ్వకుండా తామే తీసుకుంటే ఆమె 125 సిఆర్పీసీ ప్రకారం పిల్లలు మేజర్లు అయితే వారిపై ఫామిలి కోర్టులో మెయింటెనెన్స్ పిటిషన్ ను వేసినట్లయితే వెంటనే ఆమెకు మెయింటెనెన్స్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..
watch video :
Also Read: ఇది 2వ ప్రపంచ యుద్ధ సమయంలోని పెళ్లి ఆహ్వాన పత్రిక…పత్రిక చివర్లో అప్పటి పరిస్థితులను తెలియజేస్తుంది.
End of Article