2022లో టాలీవుడ్‌లో ఒక్కక్కరుగా సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. ఈ ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీకి కలిసి రాలేదనే చెప్పాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని తర్వాత టాప్ హీరోలుగా రాణించిన సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు నెలల వ్యవధిలోనే కన్నుమూయడం టాలీవుడ్‌కు కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. ఈ యేడాది సూపర్ స్టార్, రెబల్ స్టార్ సహా కన్నుమూసిన సినీ ప్రముఖుల విషయానికొస్తే..

Video Advertisement

#1 సూపర్ స్టార్ కృష్ణ

తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్‌. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. ఈయన మృతితో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిందనే చెప్పాలి.

famous personalities died in 2022

#2 రెబెల్ స్టార్ కృష్ణం రాజు

హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు. ఈయన సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు.

famous personalities died in 2022

#3 బప్పీలహరి

బాలీవుడ్ కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన పాటగాడు…ఫ్యాషన్ ఐకాన్ గా నిలిచిన సంగీత దర్శకుడు బప్పీలహరి. ఈయన ఫిబ్రవరి 16న ఈ లోకాన్ని విడిచివెళ్లారు. పలు తెలుగు చిత్రాలకు కూడా ఈయన స్వరాలను అందించారు.

famous personalities died in 2022

#4 బాలయ్య

టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య ఏప్రిల్ 9 కన్నుమూశారు. నటుడిగా 300కిపైగా చిత్రాల్లో నటించారు బాలయ్య. . నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు.

famous personalities died in 2022

#5 దర్శకుడు శరత్

ఏప్రిల్ 1 సినీయర్ దర్శకుడు శరత్ కన్నుమూసారు. ఈయన కృష్ణ హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసారు. ఈయన ఎక్కువగా బాలయ్య, సుమన్‌లతో సినిమాలను తెరకెక్కించారు.

famous personalities died in 2022

#6 తాతినేని రామారావు

తెలుగు సహా హిందీలో పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఏప్రిల్ 20న తుదిశ్వాస విడిచారు.

famous personalities died in 2022

#7 లతా మంగేష్కర్

భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ ఫిబ్రవరి 6న కన్నుమూసారు. కొన్ని రోజులుగా కోవిడ్ కారణంగా అనారోగ్యంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు.

famous personalities died in 2022

#8 పండిట్ బిర్జు మహారాజ్

ప్రపంచ ప్రఖ్యాత కథక్ నృత్యకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) జనవరి 17న గుండెపోటుతో ఆయన మరణించారు. దేవదాస్ , దేద్ ఇష్కియా , ఉమ్రావ్ జాన్ , బాజీ రావ్ మస్తానీ వంటి అనేక బాలీవుడ్ సినిమాలకు బిర్జూ మహారాజ్ నృత్య దర్శకత్వం వహించారు.

famous personalities died in 2022

#9 రమేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మరో సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు నటుడు రమేష్ బాబు (56) జనవరి 8న అనారోగ్యంతో కన్నుమూశారు.

famous personalities died in 2022

#10 ఇందిరా దేవి

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి.. మరో సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఈ యేడాది సెప్టెంబర్ 28న కన్నుమూసారు. ఈమె సినీ నటి కాకపోయినా.. భర్త, కుమారుడు సూపర్ స్టార్స్ కావడం.. ఈమె చనిపోయిన నెలన్నర వ్యవధిలో భర్త సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూయడం విచారకరం. ఒకే ఏడాదిలో మహేష్ తల్లిదండ్రులను, సోదరుడిని కోల్పోవడం విచారకరం.

famous personalities died in 2022

#11 దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి

ప్రుముఖ సినీ దర్శకుడు పి.చంద్రశేఖర్ రెడ్డి.. జనవరి 3 చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన పరిస్థితి విషమచిండంతో కన్నుమూసారు. తెలుగులో ఎంతోమంది దర్శకులకు ఆయన గురువు. సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు పిసి రెడ్డి.

famous personalities died in 2022

#12 కైకాల సత్యనారాయణ

ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ గారు ఇటీవల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

peroperties of kaikala satyanarayana..
#13 చలపతిరావు

ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చలపతిరావు గారు కూడా అనారోగ్య సమస్య కారణంగా తుది శ్వాస విడిచారు.

famous celebrities who passed away in 2022

వీరే కాకుండా మరికొంత మంది సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ సంవత్సరం మరణించారు.