“జూనియర్ ఎన్టీఆర్” పై నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఒక అభిమాని రాసిన లెటర్..! ఏం అన్నారంటే..?

“జూనియర్ ఎన్టీఆర్” పై నిరుత్సాహం వ్యక్తం చేస్తూ ఒక అభిమాని రాసిన లెటర్..! ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

వారసత్వంతో వచ్చినా కూడా తనకంటూ ఇండస్ట్రీలో స్టార్ హోదా సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారి మనవడిగా, నందమూరి హరికృష్ణ గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ తనని తాను ప్రతి సినిమాకి మెరుగు పరుచుకుంటూ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా గుర్తింపు పొందారు.

Video Advertisement

అయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కూడా ఉన్నారు. ఒక సమయంలో రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత వీటన్నిటికీ దూరంగా ఉంటూ కేవలం సినిమాలపై మాత్రమే ధ్యాస పెడుతున్నారు.

reason behind jr ntr travelling to dubai

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అనే ప్రశ్న ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బంధువు, ప్రముఖ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై ఎక్కడా కూడా మాట్లాడకపోవడం అనేది చర్చలకు దారి తీసింది. అంతే కాకుండా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైమా అవార్డ్స్ లో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లారు.

fan letter to jr ntr

Post Sourced From : Bodduluri (Twitter)

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక అభిమాని జూనియర్ ఎన్టీఆర్ పై తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ ఈ విధంగా ఒక లెటర్ రాశారు. బొద్దులూరి 99 అనే ఐడి ఉన్న ఒక ట్విట్టర్ యూజర్ ఈ విధంగా రాశారు. ఆయన తన పోస్ట్ లో, “గతంలో నిన్ను ప్రాణంలా ప్రేమించిన అభిమానిని… ఇప్పుడు కేవలం నందమూరి కుటుంబ సభ్యుడిగా నిన్ను గౌరవిస్తున్నా అంతే.., ఎవరో కొత్తగా వచ్చి సపోర్ట్ చేశారు అని, లేదా నీ అవసరం మాకు లేదని నిన్ను అభిమానించడం మానేయలేదు.”

fan letter to jr ntr

 

“మా హరన్నలో ఉన్న తెగింపు, మా రామన్నలో ఉన్న ఆవేశం, మా బాలయ్యలో ఉన్న ధైర్యం నీలో కనిపించక, నీ మొండితనం భరించలేక, నీ లోతైన మనస్తత్వం అర్థం చేసుకోలేక, నీ మౌనం సహించలేక, నీ మీద ప్రేమని నాకు నేనుగా చంపేసుకున్నా. సగటు సినీ ప్రేమికుడిగా నీ సినిమా చూస్తా అంతవరకే. సంతోషంగా ఉండు. థాంక్స్ నమస్తే.” అని రాశారు. ఇది చూసిన కొంత మంది నెటిజన్లు ఈ వ్యక్తికి మద్దతుగా మాట్లాడుతుంటే, మరి కొంత మంది మాత్రం, “జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం చేయకపోవడం అనేది ఆయన వ్యక్తిగత విషయం. అందులో మనం అందరం తలదూర్చకపోవడమే మంచిది” అని అంటున్నాడు.

ALSO READ : గొప్ప వ్యక్తిని బాధపెట్టకండి..! “చంద్రబాబు నాయుడు” పై పూనమ్ కౌర్ కామెంట్స్..! ఏం అన్నారంటే..?


End of Article

You may also like