కృష్ణాష్టమి సందర్భం గా యూవీ క్రియేషన్స్ టీం “రాధేశ్యాం” పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో ప్రభాస్, పూజ హెగ్డే లు పియానో వాయిస్తూ కనిపించారు.. కృష్ణాష్టమి కి తగ్గట్లే.. పూజ ఫ్రాక్ అంతా నెమలీకలు ఉన్నట్లు గా డిజైన్ చేసి ఈ పోస్టర్ ను రిలీజ్ చేసారు. అయితే.. ఈరోజు అప్ డేట్ వస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. సడన్ గా అప్ డేట్ రావడం తో ప్రభాస్ ఫాన్స్ కొంత వరకు ఖుషి అయినా.. ఏ సాంగ్ నో లేక టీజర్ నో రిలీజ్ చేయకుండా.. ఫోటో ను రిలీజ్ చేయడం పై అప్ సెట్ అయినట్లు ఉన్నారు.

radheshyam

కొంతమంది ఐతే.. అసలు అప్ డేట్ వచ్చినట్లే ఫీల్ అవ్వలేదు. ఎవరో ఫ్యాన్ మేడ్ పోస్టర్ అయ్యుంటుంది అని అనుకుంటున్నారు. సోషల్ మీడియా లో ఈ ఫోటో ట్రేండింగ్ లో ఉన్నప్పటికీ.. ఆ పోస్ట్ కామెంట్స్ లో అందరు ఒకటే క్వశ్చన్ వేస్తున్నారు. ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ లా ఉందే అంటూ సెటైరికల్ కామెంట్స్ వేస్తున్నారు. ఈ పోస్టర్ కూడా రియలిస్టిక్ గా కాకుండా ఎడిట్ చేసినట్లు ఉండడం తో ఇలాంటి కామెంట్స్ ఎక్కువ వస్తున్నట్లు ఉన్నాయి.