పాన్ ఇండియా హీరో ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రభాస్ అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. ఈ టీజర్ బాహుబలి టీజర్ రేంజ్ లో ఉంటుందని భావించిన ఫ్యాన్స్ అందుకు భిన్నంగా ఉండటంతో ఫీలవుతున్నారు.

Video Advertisement

బాహుబలి, బాహుబలి2 సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలేవీ అంచనాలు అందుకోలేదనే సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ కథ, కథనంలోని లోపాల వల్ల ఫ్లాప్ అయ్యాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభాస్ కు ఇప్పుడు ఒక హిట్ అవసరం.

fans getting doubts about aadipurush result
కొంత మంది ఈ టీజర్ పూర్తిగా కార్టూన్ షో లాగా ఉందని భావిస్తుంటే మరికొందరు యానిమేషన్ చేసినట్టుగా ఉందని చెప్తున్నారు.ఇక ఒక వర్గం ప్రేక్షకులు అయితే మా ప్రభాస్ ని కావాలనే పాన్ ఇండియా స్టార్ గా వెలగనివ్వకుండా అడ్డుకుంటున్నారు అని గగ్గోలు పెడుతున్నారు. ఆదిపురుష్ సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించకుండా సాధారణంగా తెరకెక్కించి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

fans getting doubts about aadipurush result
అయితే ఈ సినిమాలోని పాత్ర ల విషయం లో కూడా ప్రేక్షకుల్లో అసంతృప్తి ఉంది. సాధారణం గా మనకి రాముడు, రావణాసురుడు ఎలా ఉంటారు అన్న దానిపై ఒక అభిప్రాయం ఉంది. ఎప్పటినుంచో మనం వింటున్న కథల నుంచో చూస్తున్న సినిమాల నుంచో మనం ఒక రూపాన్ని ఊహించుకున్నాం. కానీ ఆదిపురుష్ టీజర్ లో తెల్లగా ఉన్న రాముడు, భయంకరం గా ఉన్న రావణుడిని మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నాం.

fans getting doubts about aadipurush result
బాలీవుడ్ లో పరవాలేదు కానీ తెలుగు సినిమా విషయానికి వచ్చేసరికి ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ గా ప్రభాస్ ని ఒప్పుకోలేకపోతున్నారు.ఓం రౌత్ దర్శకుడుగా వస్తున్నా ఈ సినిమా మరి జనాలని ఏమాత్రం మెప్పిస్తుందో లేదో సినిమా విడుదలవుతే కానీ తెలియదు.2023 లో వస్తున్న ఈ చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ముందే ఊహించేస్తున్నారు నెటిజన్లు. మరో వైపు భారీ అంచనాలు కూడా ఈ టాక్ కు కారణం అవుతున్నాయి.