మెగా కాంపౌండ్ నుంచి వచ్చినా అంచలంచెలుగా ఎదుగుతూ.. తన కంటూ ప్రత్యేక అభినంది గణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అల్లు అర్జున్. నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా 2003 లో ‘గంగోత్రి’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. అప్పటి నుంచి చేస్తున్న ప్రతి చిత్రం లోను కొత్తదనం చూపిస్తూ ముందుకెళ్లిన ఆయన తాజాగా వచ్చిన పుష్ప సినిమాతో ‘ఐకాన్ స్టార్’ గా మారారు.

Video Advertisement

అయితే స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారినా.. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారినా.. ఒక్క విషయం లో మాత్రం అల్లు అర్జున్ ఫాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా నిఖిల్ హీరోగా వచ్చిన ’18 పేజెస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో సినిమా గురించి కాకుండా అల్లు అర్జున్ ని పొగడటమే మెయిన్ గా పెట్టుకున్నారు. పుష్ప తో బన్నీ క్రేజ్ పెరిగిన మాట వాస్తవమే కానీ.. సొంత ప్రొడక్షన్ లో డప్పు కొట్టించుకోవడం పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఇదే విషయం బన్నీ డై హార్డ్ ఫాన్స్ కి కూడా నచ్చలేదు. ‘ఓన్ ప్రొడక్షన్ ఈవెంట్స్ కి ఇంక రాకు అన్నా’ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

fans requests allu arjun to avoid events..

అయితే అల్లు అర్జున్ పాల్గొన్న ఈవెంట్స్ పై ట్రోల్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. అల్లు అర్జున్ కి సోషల్ మీడియా లో ఫాన్స్ ఎంతమంది ఉన్నారో ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. అప్పుడెప్పుడో ‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ ఒక ఈవెంట్ లో అన్నప్పటి నుంచి ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఏ ఈవెంట్ లో అయినా అల్లు అర్జున్ ఏదొక విధం గా ట్రోల్స్ కి ఫీడ్ ఇస్తున్నాడు.

fans requests allu arjun to avoid events..

అయినా ఈవెంట్ కి వచ్చిన ప్రతి సారి ట్రోల్స్ వస్తుంటే.. బన్నీ అయినా గమనించుకోవాలి కదా.. బయట ఎలా అనుకుంటున్నారు అని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. ‘అయినా అసలు సినిమా ఈవెంట్స్ కి నువ్వు రాకు అన్నా.. ప్రతి సారి నెగటివిటీ వస్తుంది..కొన్నాళ్ళు అయినా ఈవెంట్స్ మానేస్తే బెటర్’ అంటూ అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.