అతని బట్టలు చూసి తక్కువ అంచనా వేసి అవమానించారు…చివరికి ఏమైందో తెలుసా.?

అతని బట్టలు చూసి తక్కువ అంచనా వేసి అవమానించారు…చివరికి ఏమైందో తెలుసా.?

by Anudeep

Ads

మన దేశం లో రైతుల సంఖ్యా ఎక్కువే. అలాగే, రైతుల ఆత్మహత్య ల సంఖ్యా కూడా ఎక్కువే. ఎందుకంటే మన దేశం లో వ్యవసాయానికి విలువిచ్చే రైతులు ఎంత ఎక్కువ మంది ఉన్నారో.. ఆ రైతులకు విలువనిచ్చే మనుషులు అంత తక్కువ మంది ఉన్నారు. అందుకే రైతుకు కన్నీళ్ళొస్తే..మనుషులు పట్టించుకోరు. చివరకు ఆ రైతు ఏ పురుగులమందు శరణ్యమనుకుంటాడు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో రైతుల గురించి ఎంతో గొప్పగా పొగిడే మనం.. నిజ జీవితం లో మాత్రం భిన్నం గా ప్రవర్తిస్తుంటాం. అందుకు ఉదాహరణే ఈ కథ.

Video Advertisement

ఓ గ్రామం లో ఓ రైతు ఉండేవాడు. తనకు ఉన్న పొలాన్ని సాగుచేసుకుని ఉన్నంత లో బాగానే సంపాదించాడు. ఆ రైతుకు ఒక కూతురు ఉండేది. ఆమె ను కూడా పెళ్లీడు కు వచ్చాక ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి అత్తారింటికి పంపేశాడు. రైతు మాత్రం వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. కొంతకాలానికి కూతురును చూడటానికి ఆ రైతు పట్నం వచ్చాడు. కూతురిని చూసి తిరుగు ప్రయాణం అయ్యేసరికి చాలా ఆలస్యం అయిపొయింది. దీనితో ఆ రైతు రైల్వే స్టేషన్ వద్దకు వచ్చాడు. అక్కడే ఓ పక్క గా ఫైవ్ స్టార్ హోటల్ ఉండడం గమనించాడు. రైలు వచ్చేలోపు ఆ హోటల్ లో భోజనం చేయవచ్చని ఆ రైతు భావించాడు.

ఆ రైతు ఆ హోటల్ లోకి వెళ్ళగానే పంచె కట్టు లో ఉన్న అతన్ని చూసి అందరు అదోలా చూడడం ప్రారంభించారు. ఈ లోపు అక్కడి వెయిటర్లు ఈ విషయాన్నీ మేనేజర్ కు చేరవేశారు. ఆ మేనేజర్ రైతు వద్దకు వచ్చి.. నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు. నీ వద్ద డబ్బులు ఉన్నాయా అంటూ ప్రశ్నించాడు. నీకు ఏమైనా తినాలని ఉంటె.. బయట చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి. వాటిలో తిను అంటూ రైతు వైపు హేళన గా చూసాడు. దీనితో, అసలు విషయం అర్ధం చేసుకున్న రైతు తన వద్ద ఉన్న డబ్బుని తీసి టేబుల్ పై పెట్టాడు.. వెంటనే ఆ మేనేజర్ గొంతు సవరించుకుని సర్ కి ఏమి కావాలో పెట్టండి..అని వెయిటర్లకు ఆదేశించి అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

ఆ రైతు ఆ హోటల్ లో ఉండే అత్యంత ఖరీదైన ఫుడ్ ను తెప్పించుకుని, శుభ్రం గా తినేసి, అక్కడి వెయిటర్ కు రెండు వేల రూపాయలను టిప్ గా ఇచ్చాడు.. వెళ్తూ వెళ్తూ, మనుషులు వేసుకున్న దుస్తులను బట్టో, పై పై మెరుగులు చూసే ఓ వ్యక్తి గురించి ఒక అంచనా కి రావద్దు, ఎవరిని తక్కువ చేసి చూడవద్దు అంటూ హిత బోధ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

 


End of Article

You may also like