సాధారణంగా ఎండాకాలం సమీపిస్తుంది అంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మామిడి తోటలు మామిడి పండ్లతో కళకళలాడుతాయి. ఈ తరుణంలోనే చాలామంది మామిడి పచ్చడితో పాటుగా, వివిధ రకాల పచ్చళ్లను పెడుతూ ఉంటారు.. అయితే ఈ పచ్చడి పెట్టడంలో కూడా చాలా అనుభవం ఉండాలి.. ఎందుకంటే అది ఇవాళ తిని రేపు పడేసేది కాదు కాబట్టి.. అది కొన్ని నెలలపాటు నిల్వ చేసే ఆహారం.. కాబట్టి పచ్చడి చేసేటప్పుడు కొన్ని మెలకువలు తప్పనిసరిగా పాటించాలి.. అవేంటో ఒకసారి చూద్దాం..!!

Video Advertisement

సాధారణంగా మనం పచ్చడి పెడితే ఒక్కోసారి బూజు పడుతుంది.. దీనికి ప్రధాన కారణం శిలింద్రాల జాతికి చెందిన ఒక జీవి.. ఈ బూజు అనేది ఉష్ణోగ్రత తక్కువైనా, గాలిలో తేమ శాతం అధికంగా ఉన్న బూజు పడుతుంది.. దీంతో పాటుగా పచ్చడి పెట్టేటప్పుడు ప్రధానమైనది ఉప్పు.. పచ్చడిలో ఉప్పు ఎక్కువ ఉంటే బూజు పెరుగుదలను ఆపేస్తుంది.

అంతే కాకుండా పచ్చడిలో వేసే కారం మరియు నూనె సుష్మ జీవులు ఇతర హానికర క్రిములు తయారుకాకుండా అడ్డుకుంటాయి. పచ్చళ్లను పెట్టడానికి ముందుగానే మామిడి ముక్కలను బాగా కడిగి తుడిచి తడి లేకుండా చేసి పచ్చడి పెట్టే జాడీలు కూడా బాగా శుభ్రం చేసి ఎండలో ఆరబెట్టి, అందులో ఎలాంటి సూక్ష్మక్రిములు లేకుండా చేస్తారు. ఆడవారు నిల్వ పచ్చడి చేసేటప్పుడు తలలో పూలు కూడా పెట్టుకోరు.

ఈ పూలు పెట్టుకోవడం వల్ల పచ్చడి పెట్టేటప్పుడు ఏమైనా అందులో పడితే అంతా చెడిపోతుంది. ఈ విధమైన జాగ్రత్తలతో బయటి నుంచి వచ్చే సూక్ష్మక్రిములను అడ్డుకునే వారు. ఇలాంటి పచ్చని పెట్టేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు పచ్చళ్ళు బూజు పట్టేలా చేస్తాయి. అయితే జాడీలో మాత్రం బూజుపట్టిన ప్రాంతంలోని పచ్చడి తీసేసి అక్కడ శుభ్రంగా తుడిచి పెడితే మళ్లీ బూజు రాకుండా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు పూర్వకాలం నుండి ఉన్నాయి.