దక్షిణాది చిత్ర పరిశ్రమతోపాటు దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారి తీసిన చిత్రం ది లెజెండ్. తమిళనాడులో శరవణన్ గ్రూప్ అధినేత శరవణన్ అరుల్ హీరోగా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందు సంపాదించుకొన్న క్రేజ్‌ను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లుగా మలచలేకపోయింది.

Video Advertisement

 

ది లెజెండ్‌’ మూవీ జూలై 28 న రిలీజ్ అయ్యింది. ఇదేమీ సూపర్ హిట్ మూవీ కాదు. కానీ ఈ మూవీ ఇంకా ట్రెండింగ్ లో ఉండటానికి కారణం మాత్రం ఈ చిత్రం హీరో మరియు శరవణ స్టోర్స్‌ అధినేత అయిన అరుళ్‌ శరవణన్‌. 51 ఏళ్ల వయసులో ఇతను హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘శరవణ ప్రొడక్షన్స్‌’ అనే బ్యానర్ ను స్థాపించి మరీ రూ.80 కోట్ల బడ్జెట్‌ పెట్టి ఈ పాన్ ఇండియా సినిమాని తీశాడు.

finally the legend movie coming in ott..

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.25 కోట్లు కూడా చేయలేకపోయింది. కేవలం తన శరవణన్ స్టోర్స్ ప్రమోషన్ కోసం మాత్రమే అతను హీరోగా మారి ఈ సినిమా తీసినట్టు స్పష్టమవుతుంది. ఈ సినిమాకి ఇదివరకే ఓటీటీ కోసం భారీ ఆఫర్స్ రాగా అరుళ్‌ ఆసక్తి చూపలేదు. అయితే ఫైనల్ గా అతను ‘ది లెజెండ్’ ను ఓటీటీకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. డిసెంబర్ నెలలో ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అని సమాచారం.

finally the legend movie coming in ott..

ఇదిలా ఉండగా ఇప్పుడు రెండో సినిమాతో మరో సెన్సేషన్‌కు రెడీ అవుతున్నారు శరవణన్ అరుళ్. ఐదు పదుల వయసులో రొమాంటిక్ స్టార్ అనిపించుకునేందుకు తంటాలు పడుతున్నారు. త్వరలోనే ఓ యాక్షన్ రొమాంటిక్ కథతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని తీసుకోనున్నారట. హీరోయిన్ గా ఓ బాలీవుడ్ టాప్ బ్యూటీని కూడా పరిశీలిస్తున్నారట.