అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. నాగార్జున కమర్షియల్ సినిమాలలోనే కాకుండా భక్తి సినిమాలలో నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు.

Video Advertisement

కమర్షియల్ హీరో అయిన నాగార్జున అన్నమయ్య సినిమాతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ మూవీలో అన్నమయ్య పాత్రలో జీవించాడు. భక్తుడిగా నాగార్జున నటించిన ఈ సినిమాలో శ్రీ వెంకటేశ్వరస్వామిగా సుమన్ ఆకట్టుకున్నాడు. ఈ పాత్రలో నటించిన సుమన్ ఆడియెన్స్ నీరాజనాలు అందుకున్నారు. అయితే ఈ పాత్రకు ముందుగా అనుకున్నది సుమన్ ని కాదట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అప్పటిదాకా ప్రేమకథలు మరియు కమర్షియల్ సినిమాలు చేస్తున్న నాగార్జునను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు  అన్నమయ్య సినిమాతో ప్రేక్షకులకు సరికొత్తగా పరిచయం చేశారు. ఈ మూవీ ప్రకటించిన సమయంలో అన్నమయ్యగా నాగార్జున అంటే ఎంతోమంది విమర్శించారు. కానీ మూవీ రిలీజ్ అయ్యి, అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత అన్నమయ్య పాత్రలో నాగార్జునను తప్ప మరెవరిని ఊహించలేమనే ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీలో శ్రీ వెంకటేశ్వరస్వామిగా సుమన్ అదే స్థాయిలో పేరు, ప్రఖ్యాతులను పొందారు.
సుమన్ కెరీర్లో బిగ్గెస్ట్ సినిమాగా అన్నమయ్య నిలిచింది. శ్రీ వెంకటేశ్వరస్వామిగా సుమన్ అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు. అయితే ఈ పాత్రకు ముందుగా అనుకున్నది సుమన్ ని కాదట. ఈ మూవీలో అన్నమయ్య వెంకటేశ్వరస్వామి పాదాలను మొక్కే సన్నివేశం ఉండడంతో రాఘవేంద్రరావు పెద్ద స్టార్ ని తీసుకోవాలని భావించి, హీరో శోభన్ బాబును సంప్రదించారట. కానీ అప్పటికే ఆయన సినిమాలు మానేసారు. పాత్ర నచ్చినప్పటికి, తిరిగి నటించాలని లేకపోవడంతో రిజెక్ట్ చేయలేక యాబై లక్షల పారితోషికం అడిగారంట.
అప్పట్లో అది చాలా పెద్ద మొత్తం అవడంతో వద్దనుకున్నారంట. ఆ తరువాత నందమూరి బాలకృష్ణను ఆ పాత్ర కోసం సంప్రదించారంట. కానీ నందమూరి, అక్కినేని అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌లు వస్తాయేమో అని వ‌ద్ద‌నుకున్నారట.
బాగా ఆలోచించి సుమ‌న్ కూడా సీనియ‌ర్ నటుడు కావ‌డంతో, ఆయన నటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వని రాఘ‌వేంద్రరావు సుమన్‌ని పిలిపించి, వెంకటేశ్వరస్వామి గెటప్ వేయడం, అది సుమన్ కు చక్కగా సరిపోవడంతో  వెంకటేశ్వరుడి పాత్రలో సుమన్ తీసుకున్నారు. ఆయన ఆ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.

Also Read: ఎన్టీఆర్ “నాణెం” ఆవిష్కరణ వేడుకకి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు వెళ్లలేదు..? అసలు విషయం ఏంటంటే..?