ప్రపంచంలోనే మొదటి బంగారు హోటల్‌.. ఇక్కడ ప్లేట్‌ నుండి టాయిలెట్‌ సీటు వరకు అంతా బంగారమే..

ప్రపంచంలోనే మొదటి బంగారు హోటల్‌.. ఇక్కడ ప్లేట్‌ నుండి టాయిలెట్‌ సీటు వరకు అంతా బంగారమే..

by kavitha

Ads

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో  ప్రత్యేకమైన హోటళ్లు ఉన్నాయి. ఆ హోటళ్లు వింత డిజైన్లకు ఫేమస్ చెందాయి. ఇలాంటి హోటళ్లలో వియత్నాంలో ఉన్న హోటల్ మరింత ప్రత్యేకమైనది గా నిలిచింది. ఈ హోటల్ వియత్నాం రాజధాని హనోయిలో ఉంది. దీని స్పెషలిటీస్ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఎందుకంటే ఈ హోటల్ లో  ప్రతిదీ బంగారంతో తయారు చేశారు.

Video Advertisement

హనోయిలోని ఉన్నఈ ఫైవ్ స్టార్ హోటల్ పేరు డోల్స్ హనోయి గోల్డెన్ లేక్. ఇది 25 అంతస్తులతో నిర్మించబడింది. ఈ అందమైన హోటల్ లో 400 గదులు ఉన్నాయి. హోటల్ యొక్క గోడలకు బంగారు పూతతో చేసిన పలకలు 54,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి.ఇక్కడ పనిచేసే ఉద్యోగుల డ్రెస్ కోడ్ కూడా స్పెషల్ గా ఉంటుంది. సిబ్బంది దుస్తుల ఎరుపు రంగులో ఉంటుంది. గదుల్లోని ఫర్నీచర్ కూడా బంగారు పూతతో ఉంటాయి. ఈ హోటల్ పై భాగంలో ఇన్ఫినిటీ పూల్ ఉంది. కొలను వెలుపల ఉండే గోడలపై ఉన్న ఇటుకలు బంగారు పూతతో ఉంటాయి. 2009 లో ఈ హోటల్ నిర్మించబడింది. బంగారం మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని నమ్ముతారు. అందువల్ల దీనిని బంగారంతో తయారు చేశారు.ఇక ఇక్కడ గదుల ప్రారంభ ఖరీదు సుమారు 20 వేల రూపాయలు. డబుల్ బెడ్ రూం సూట్  ఒక రాత్రి ఉండేందుకు రెంట్ 75 వేలు. ఇందులో  6 రకాల గదులు, 6 సూట్‌లు ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ సూట్ లో ఉండేందుకు ఒక రాత్రికి  రూ.4.85 లక్షలు.ఇక్కడి రూమ్స్ లో ఫర్నిషింగ్‌ గోల్డ్‌ కోటెడ్‌తో ఉంటాయి. బాత్రూమ్, షవర్, సింక్, ఇలా అన్నీ బంగారంతో ఉంటాయి.ఈ హోటల్‌లో గేమింగ్ క్లబ్ ఉంది. ఈ క్లబ్ 24 గంటలు తెరిచే ఉంటుంది. ఇందులో పేకాట, క్యాసినో లాంటి ఆటలు కూడా ఆడతారు. ఇక్కడ అవి ఆడి గెలిచి డబ్బు కూడా సంపాదించవచ్చు.Also Read: “స్వాతంత్య్రం” రాకముందు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న… “పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ ఎలా ఉండేది అంటే..?


End of Article

You may also like