ప్రపంచంలో మొట్టమొదటి పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా..? అసలు ఈ సాంప్రదాయాన్ని ఎవరు మొదలు పెట్టారు అంటే..?

ప్రపంచంలో మొట్టమొదటి పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా..? అసలు ఈ సాంప్రదాయాన్ని ఎవరు మొదలు పెట్టారు అంటే..?

by kavitha

Ads

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతారు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక ముఖ్యమైన ఘట్టం. పెళ్లితో ఇద్దరు వ్యక్తులే కాకుండా  రెండు కుటుంబాలు మధ్య బంధం ఏర్పడుతుంది. వరుడు, వధువు కుటుంబాలు పెళ్ళిని ఘనంగా, వేడుకలా జరుపుతుంటారు.

Video Advertisement

గతంలో పెళ్లిని 5 రోజుల నుంచి 16 రోజుల పాటు వేడుకలా జరుపుకునేవారు. అయితే రానురాను వివాహ సంప్రదాయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. అసలు పెళ్లి సంప్రదాయాలను ఎవరు? ఎప్పుడు మొదలుపెట్టారు? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం..
పూర్వకాలంలో వివాహ వ్యవస్థ లేదు. స్త్రీ, పురుషులు స్వతంత్రంగా జీవించేవారట. మహాభారతంలో వివాహం ఎలా వచ్చింది అనే కథ ఉంది. ఉద్దాలక మహర్షి కొడుకు శ్వేతకేతు మహర్షి. ఒకసారి ఆయన తన ఆశ్రమంలో ఉండగా,  అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పురుషుడు తన తల్లి చెయ్యి పట్టుకున్నాడు. అది చూసిన శ్వేతకేతు మహర్షికి ఆగ్రహం వచ్చింది. అయితే ఈ నియమం పూర్వ కాలం నుంచి వస్తోందని అతనికి తండ్రి ఉద్దాలక మహర్షి తెలిపారు.
శ్వేతకేతు మహర్షి ఈ నియమాన్ని వ్యతిరేకిస్తూ, ఇలా జీవించడం జంతువులలా జీవించడం వంటిదే అని, భార్య భర్తకు విధేయంగా ఉండే విధంగా వివాహ ధర్మాలను రూపొందించాడు. వివాహం తర్వాత వేరే పురుషుడి వద్దకు వెళ్లే భార్యకు పాపం వస్తుందని, అదేవిధంగా భార్యను వదిలి పర స్త్రీల దగ్గరికి వెళ్లే పురుషుడు పాప ఫలితాన్ని పొందాల్సి వస్తుందని తెలిపాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్న దాంపత్య వ్యవస్థకు శ్వేతకేతు మహర్షి రూపొందించిన వివాహ ధర్మాలే మూలమని చెబుతుంటారు.
చరిత్ర ప్రకారం, ప్రపంచంలో 4 శతాబ్దాల కన్నా ముందు, దాదాపు 4,350 ఏళ్ల  క్రితం మెసొపొటేమియాలో తొలిసారిగా వివాహం జరిగినట్లు ఆధారాలున్నాయని తెలుస్తోంది. మెసొపొటేమియాలో స్త్రీ, పురుషులు మొదటిసారిగా పెళ్లి వేడుకను జరుపుకున్నారట.

Also Read: ఫేస్బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ వల్ల ఆ 18 ఏళ్ల యువతి పెళ్లి ఆగిపోయింది.! ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి.?


End of Article

You may also like