Ads
మీర్ కమర్-ఉద్-దిన్ ఖాన్ సిద్ధిఖీ బయాఫండి (అసఫ్ జా) మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క కుడి భుజంగా ఉండి తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అతన్ని చిన్ ఖిలిచ్ ఖమరుద్దీన్ ఖాన్ మరియు నిజాం-ఉల్-ముల్క్ అని కూడా పిలుస్తారు. అసఫ్ జా ఘాజీ ఉద్-దిన్ ఖాన్ ఫిరోజ్ జంగ్, వజీర్ అన్-నిస్సాల కుమారుడు.
Video Advertisement
ఈయన గుల్బర్గాలోని సయ్యద్ కులీనుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అసఫ్ జా కి నలుగురు బిడ్డలు. అసఫ్ జా ఔరంగజేబుకి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. ఔరంగజేబు మరణం తరువాత అతన్ని ఔధ్ గవర్నరుగా నియమించారు. బహదూర్ షా మరణం తరువాత అతను ఢిల్లీలో ఉండేవాడు. 1712 లో ఔరంగజేబు వారసుల్లో ఆరవ వాడైన ఫరుఖ్‌సియార్ కుమారుడు అజీముష్షాన్ డెక్కన్లో రాజప్రతినిధి పదవి చేపట్టేందుకు అతణ్ణి ఒప్పించాడు. అతడికి నిజాం ఉల్-ముల్క్ టైటిల్ ఫతే జంగ్ అనే బిరుదు ఇచ్చాడు.
అయితే మొగలు దర్బారు లోని అంతఃపుర రాజకీయాలకు, కుట్రలూ కూహకాలకూ విసుగెత్తిన నిజాం ఉల్-ముల్క్, తన వజీరు పదవికి రాజీనామా చేసి, దక్కనుకు చేరుకున్నాడు. ఇతను 1724లో “శక్కర్ ఖేడా” యుద్ధంలో ముబారక్ ఖాన్ ని ఓడించి అసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించారు. దీంతో ఆయన హైదరాబాద్ మొదటి నిజాంగా మారాడు. వారి వంశాన్ని అసఫ్ జాహీ నిజాంలు లేదా హైదరాబాద్ నిజాంలుగా పేర్కొనేవారు.
గోల్కొండలోని ప్రసిద్ధ గనులు నిజాంల సంపదకు ప్రధాన వనరుగా ఉన్నాయి, 18వ శతాబ్దంలో హైదరాబాద్ రాజ్యం ప్రపంచ మార్కెట్‌కు వజ్రాల సరఫరా చేసే ఏకైక సంస్థగా మారింది. అసఫ్ జా ప్రైవేట్ గా విద్యను అభ్యసించడమే కాక.. ఫాషన్ పై మంచి పట్టు కలిగి ఉండేవాడు.
అసఫ్ జా కుమారులు, మనవడు-నాసిర్ జంగ్, ముజఫర్ జంగ్మ, సలాబత్ జంగ్ నిజాం వాళ్ళ ఏర్పడిన రాజకీయ అస్థిరతతో ఆయన మనోవ్యధకు గురయ్యాడు. చివరికి ఉల్ ముల్క్ 76 సంవత్సరాల వయస్సులో, 1748 జూన్ 1 న బుర్హాన్‌పూర్‌లో మరణించాడు. అతని దేహాన్ని ఔరంగాబాదు వద్ద, ఔరంగజేబు సమాధికి దగ్గర్లోనే ఖననం చేశారు.
Also read: “జవహర్‌లాల్ నెహ్రూ” ఇచ్చిన మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ చూశారా..? ఇందులో ఏం మాట్లాడారు అంటే..?
End of Article