“జవహర్‌లాల్ నెహ్రూ” ఇచ్చిన మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ చూశారా..? ఇందులో ఏం మాట్లాడారు అంటే..?

“జవహర్‌లాల్ నెహ్రూ” ఇచ్చిన మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ చూశారా..? ఇందులో ఏం మాట్లాడారు అంటే..?

by kavitha

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత తొలి ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నిక అయ్యారు. ఈ విషయం అందరికి తెలిసిందే. జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు అయిన నవంబర్ 14న దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాము.

Video Advertisement

నెహ్రూకు పిల్లల అంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉండేది. పిల్లలే భారతదేశం యొక్క భవిష్యత్తు అని పండిట్ నెహ్రూ బలంగా నమ్మేవారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మొట్టమొదటిసారిగా 1953లో టెలివిజన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
Jawaharlal-Nehru-first-interview1జవహార్ లాల్ నెహ్రూ 1889 లో ఉత్తరప్రదేశ్ లో అలహాబాద్ పట్టణంలో నవంబర్ 14న జన్మించారు. ఆయన ప్రాథమిక చదువు మొత్తం ఇంటి దగ్గర ప్రైవేటు టీచర్ల దగ్గర సాగింది. 15 ఏళ్లకే నెహ్రూ ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్ వెళ్లారు. ఇంగ్లండ్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తన చదువును కొనసాగించారు. ఆ తరువాత అక్కడే ఇన్నర్ టెంపుల్ అనే న్యాయ విద్యా సంస్థలో చేరి లా పూర్తిచేశారు. విద్యార్థిగా దశలోనే నెహ్రూ తెల్లదొరల పాలనను వ్యతిరేకించాడు.
నెహ్రూ విద్యాభ్యాసం ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీతో పాటు పోరాడారు. సహాయ నిరాకరణ సమయంలో నెహ్రూ 2 జైలుకు వెళ్లారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పండిట్ నెహ్రూ క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం కోసం జూన్ 1953లో లండన్ కు వెళ్లారు. అక్కడ పండిట్ నెహ్రూ తొలిసారిగా టెలివిజన్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అప్పటికి ఇండియాలో టెలివిజన్ అందుబాటు లేదు. ఆ ఇంటర్వ్యూలో వాఖ్యత పండిట్ నెహ్రూను నాకు తెలిసి ఇది మీ మొదటి టెలివిజన్ ఇంటర్వ్యూ అని అడుగగా, దానికి జవహార్ లాల్ నెహ్రూ అవును, అంతకుముందు తాను ఎప్పుడూ టీవీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని ఆయన చెప్పారు. టెలివిజన్ గురించి విన్నాను. కానీ ఎక్కువగా అవగాహన లేదని తెలిపారు. పూర్తి ఇంటర్వ్యూని క్రింది వీడియోలో చూడవచ్చు.

Also Read:  “భారతదేశం” లో జరిగిన మొట్టమొదటి ట్రైన్ ప్రమాదం ఏదో తెలుసా..? ఎక్కడ జరిగిందంటే..?


You may also like