రైలు ప్రయాణం అందరికి ఆనందాన్నిస్తుంది.. దేశంలో ఎక్కడికైనా ప్రయాణించడానికి ఇదే ఉత్తమ సాధనం. తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంతే కాకుండా సుఖ వంతంగా, సురక్షితంగా ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. అందుకే లాంగ్ జర్నీ లు అయినా.. సాధారణ ప్రయాణాలు అయినా చాలా మంది ట్రైన్ జర్నీకే ఓటేస్తారు.

Video Advertisement

అయితే తాజాగా ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్‌ దేశాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. బెంగళూరు- హౌరా సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​, షాలిమార్​- చెన్నై సెంట్రల్​ కోరమండల్​ ఎక్స్​ప్రెస్​, గూడ్స్​ రైలు.. బాలాసోర్​లోని బహనాగా బజార్​ స్టేషన్​కు సమీపంలో ప్రమాదానికి గురయ్యాయి. సుమారు 290 మంది మరణించగా.. 1200 మందికి పైగా గాయపడ్డారు. ఈ స్థాయిలో ప్రమాదం జరగడం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. దేశ చరిత్రలో అతి భయానక రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచిపోతుంది.

first train accident in india..!!

ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అయితే దేశంలో ఇప్పటివరకు జరిగిన ఘోర ప్రమాదాల జాబితాలో ఈ ఘటన కూడా చేరిపోయింది. దేశంలో రైల్వే ప్రమాదాల చరిత్రను పరిశీలిస్తే.. తొలిసారిగా 1907లో మొదటి రైలు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న కోట్ లఖ్‌పత్ ప్రాంతంలో అక్టోబర్ 24న గూడ్స్ రైలును ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని చాలా కోచ్‌లు ఒకదానిపై ఒకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు.

first train accident in india..!!

రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయం. ట్రాక్‌పై ఉన్న వాహనానికి తెలియకుండా, అదే ట్రాక్‌పై ఇతర వాహనం ఎలా వస్తుందనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి పరిష్కారం ఏమిటన్నది చూడాలి. మానవ తప్పిదం వల్ల ఇంత ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయా.. లేదా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న దానిపై రైల్వే శాఖ దృష్టి సారించాల్సి ఉంది.

first train accident in india..!!

గత 8 ఏళ్లలో రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనల్లో 22 కేసులు నమోదయ్యాయి. ఈ దశాబ్దంలో అనేక రైలు ప్రమాదాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. వీటిల్లో కొన్ని మాటలకందని విషాదాన్ని మిగిల్చాయి.

Also read: రైలు ప్రయాణికుల కోసమే ఈ యాప్స్..!!