Ads
ఒకప్పుడు ధనికులు మాత్రమే విమాన ప్రయాణం చేసేవారు. అయితే ప్రస్తుతం సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అందువల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఎక్కువగా విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. ఇక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్లాలనుకునేవారు ఎయిర్‌పోర్టుకు వెళ్లి సంతోషంగా విమానాలను ఎక్కి వెళ్తున్నారు.
Video Advertisement
దాని వల్ల ఎయిర్‌పోర్టుల సంఖ్యకు పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో అగ్ర దేశాల లిస్ట్ లో చేరిన 5 దేశాల్లో విమాన పాసింజర్స్ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడంతో ఆ దేశాలలో విమానాశ్రయాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఎయిర్‌పోర్టుల ద్వారా మిలియన్ల కొద్ది ప్రజలు విమానాల్లో ప్రయాణిస్తున్నారు. అమెరికా:
అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 14,712 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఇక వీటిలో 102 అంతర్జాతీయంగా ప్రయాణించే సౌకర్యాన్ని కలగచేస్తున్నాయిబ్రెజిల్:
వెయ్యికి పైగా ఎయిర్‌పోర్టులు కల దేశాల్లో బ్రెజిల్ 4,093 ఎయిర్‌పోర్టులు కలిగి 2వ స్థానంలో ఉంది. ఇక వీటిలో 23 అంతర్జాతీయంగా ప్రయాణించే సౌకర్యాన్ని కలగచేస్తున్నాయి.మెక్సికో:
మెక్సికో 1714 ఎయిర్‌పోర్టులు కలిగి 3వ స్థానంలో ఉంది. ఇక వీటిలో 36 అంతర్జాతీయంగా ప్రయాణించే సౌకర్యాన్ని కలగచేస్తున్నాయి.కెనడా:
కెనడాలో 1467 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వెయ్యికి పైగా విమానాశ్రయాలు కల దేశాల్లో కెనడా 4వ స్థానంలో నిలిచింది. కెనడా స్వచ్ఛమైన పర్యావరణానికి పేరు గాంచింది. అందువల్ల ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుండి ఏడాది పొడవున మిలియన్ల కొద్ది పర్యాటకులు వస్తుంటారు.రష్యా:
రష్యాలో 1218 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వెయ్యికి పైగా విమానాశ్రయాలు కల దేశాల్లో రష్యా 5వ స్థానంలో ఉంది. రష్యా రాజధాని మాస్కోలో ఒక మీడియం, 2 ప్రధాన ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఏడాదికి 80 మిలియన్లకు పైగా పాసింజర్స్ వీటి సర్వీసులను ఉపయోంచుకుంటున్నారు.Also Read: స్టాంప్ పేపర్లలో ఉన్న ఈ రకాల గురించి తెలుసా? ఏ స్టాంప్ పేపర్ ని ఏ అవసరం కోసం వాడతారంటే?
End of Article