ఈ సినిమాలను శృతిహాసన్ రిజెక్ట్ చేయకపోయి ఉండుంటే.. ఆమె కెరీర్ మరోలా ఉండేది..?

ఈ సినిమాలను శృతిహాసన్ రిజెక్ట్ చేయకపోయి ఉండుంటే.. ఆమె కెరీర్ మరోలా ఉండేది..?

by Anudeep

Ads

శృతి హాసన్.. ఇప్పటి వరకు అంత గా బాడ్ రిమార్క్ లు లేని అమ్మాయి. స్టార్ కిడ్ అయినా కూడా స్వయం కృషితో ఇండస్ట్రీ లో నిలబడి తన టాలెంట్ తోనే నటి గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. శృతి సింగర్ కూడా. మ్యూజిక్ డైరెక్టర్ గా, డాన్సర్ గా శృతి పలు ఆల్బమ్స్ ను రూపొందించి అభిమానులను సంపాదించుకుంది. అయితే, సింగర్ గా సక్సెస్ అయ్యాక నటి గా కెరీర్ ను ప్రారంభించింది.

Video Advertisement

sruthi hasan

కెరీర్ ప్రారంభం లో తెలుగు నాట ఆమె సినిమాలు అంతగా ఆడకపోయినా.. గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. గబ్బర్ సింగ్ తో శృతి కి స్టార్ డమ్ వచ్చేసింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో ఆమె ప్రేమలో పడింది. ఆ కారణం తో సినిమాలకు దూరం గా ఉంది. ఆ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వెండితెర దుమ్ము దులిపేసింది.

శ్రీమంతుడు, ఎవడు సినిమాలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా క్రాక్ సినిమా తో ఆమె సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా, ప్రభాస్ “సలార్” సినిమా లో కూడా శృతి హాసన్ ఎంపికైంది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో శృతి కొన్ని సినిమాలను రిజెక్ట్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

#1 బిజినెస్ మాన్:

1 business man

మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబో లో బిజినెస్ మాన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా తొలుత శృతి హాసన్ ను అనుకున్నారు. కానీ, ఆమె రిజెక్ట్ చేయడం తో ఆ ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు.

#2 జెర్సీ:

2 jersi

నాని హీరో గా గౌతమ్ తిన్న నూరి డైరెక్షన్ లో వచ్చిన జెర్సీ సినిమా సూపర్ హిట్ అయింది కదా. ఈ సినిమా లో కూడా శృతి హాసన్ కు అవకాశం వచ్చినప్పటికీ వదులుకుంది.

#3 అమర్ అక్బర్ ఆంటోనీ :

3 amar akbar antony

శ్రీను వైట్ల డైరెక్టర్ గా రవి తేజ హీరో గా వచ్చిన ఈ సినిమా ను కూడా శృతి హాసన్ రిజెక్ట్ చేసింది.

#4 రెబెల్:

4 rebel

లాఘవ లారెన్స్ దర్శకుడు గా ప్రభాస్ హీరో గా వచ్చిన సినిమా రెబెల్. ఈ సినిమాలో తమన్నా కథానాయిక గా నటించింది. కానీ ఈ సినిమాలో తమన్నా కంటే ముందు శృతి హాసన్ నే సంప్రదించారట. ఏ పాత్ర కోసం శృతిని సంప్రదించారో తెలియదు కానీ ఈ సినిమాలో నటించే అవకాశాన్ని కూడా శృతి వదులుకుంది.

#5 దువ్వాడ జగన్నాధం:

5 dj

అల్లు అర్జున్ హీరో గా నటించిన “దువ్వాడ జగన్నాధం” సినిమా లో కూడా శృతి హాసన్ నే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ, ఆమె రిజెక్ట్ చేయడం తో ఈ పాత్ర కు పూజ హెగ్డే ను ఫైనల్ చేసారు.


End of Article

You may also like