Ads
ఏ రంగంలోనైనా సరే సక్సెస్ ఉంటేనే గుర్తింపు ఉంటుంది. పైగా సినిమా ఇండస్ట్రీలో అసలు సక్సెస్ లేకపోతే పట్టించుకునే నాధుడే లేడు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే సక్సెస్ ఒకటే కొలమానం. అయితే ఒక దర్శకుడు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్లు దాటుతున్న కూడా ఆయన తీసిన సినిమాల్లో 80% ఫ్లాపులే ఉన్నాయి.
ఆయనే వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ. అభిమానులు ఆయనను ముద్దుగా ఆర్జీవి అని పిలుస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే రాంగోపాల్ వర్మ మొత్తం తన కెరీర్ లో 34 సినిమాలు డైరెక్ట్ చేశారు. అందులో మొత్తం ఐదు సినిమాలు మాత్రమే పెట్టిన పెట్టబడిన తిరిగి తీసుకువచ్చాయి.మిగతా సినిమాలన్నీ కొన్ని యావరేజీలుగా నిలిస్తే మరికొన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇప్పటికి సినిమాలు తీస్తున్నా ఆర్టీవీ ఎక్కువ శాతం పోర్న్ కంటెంట్ సినిమాల వైపు దృష్టి మళ్లించాడు. 1989లో నాగార్జునతో తీసిన శివ సినిమాతో ఇండియన్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. ఆయన టేకింగ్ ఇప్పటికీ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని అందరూ మంది ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. రాంగోపాల్ వర్మ శిష్యులు పూరి జగన్నాధ్, కృష్ణవంశీ ఇలాంటివారు సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.ఆయన తీసిన శివ, సత్య, రంగీలా, ఇతర చిత్రాల ప్రభావం భారతీయ సినిమా, చిత్ర నిర్మాతలపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఈ కారణంగానే ఆర్జీవీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీల్లో గొప్ప, అత్యంత ప్రభావవంతమైన ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపు పొందాడు.
ఆర్జీవీ తన కథతో ప్రొడ్యూస్ చేసిన షూల్ హిందీలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ గెలుచుకుంది. తర్వాత సర్కార్, రక్త చరిత్ర వంటివి యావరేజ్‌గా నడిచాయి. 2010 తర్వాత ఆయన కెరీర్ దారుణంగా పతనమైంది. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితం ఆధారంగా వ్యూహం సినిమాని తనికెక్కించారు. అది రిలీజ్ లకు ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తను యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాల విషయాలపై మాట్లాడుతూ కోట్లలో వ్యూ సాధిస్తూ ఉంటాడు. అయితే రాంగోపాల్ వర్మ అని ఆయన అభిమానులు హైలీ మెచ్యూర్డ్ పర్సన్ గా పరిగణిస్తూ ఉంటారు. రాంగోపాల్ వర్మ ని ఆదర్శంగా తీసుకున్నట్లు పలువురు ఐఏఎస్ లు కూడా తెలిపారు. అయితే అటువంటి స్టార్ డైరెక్టర్ ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండటం నిజంగా విచారకరం.
End of Article