Ads
భారతదేశం నుండి ఇతర దేశాలకు ఉద్యోగరీత్య వెళ్లి అక్కడే సెటిల్ అవుతున్నారు. అయితే ఇలాంటి వారి పెళ్లి విషయానికి వచ్చే సరికి తిరిగి భారత దేశ సంస్కృతిని ఇష్టపడి అటువంటి అమ్మాయిల్ని కోరుకుంటున్నారు, పెళ్లి తరువాత విదేశాలకు తిరిగి వెళ్ళిపోతున్నారు.
Video Advertisement
ఇలా జరగడం వల్ల అమ్మాయిలు భవిష్యత్తు చాలా వరకూ డిస్టర్బ్ అవుతోంది. అంతేకాదు వారికి మర్యాద దక్కట్లేదు, కట్నం కోసం వేధించడం లాంటివి కూడా జరుగుతుంటాయి. అలాటప్పుడు అమ్మాయిలు ఏం చేయాలి…? కాబట్టి అమెరికా సంబంధాలను చేసుకునే ముందు వీటన్నిటిని తెలుసుకోండి.
ఎవరైనా సరే పెళ్లి చేసేటప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయాలి. అలాంటిది ఇతర దేశానికి పంపిస్తున్నారు అంటే ఇంకా జాగ్రత్త పడాలి. విదేశాల్లో డిటెక్టివ్ ఏజెన్సీలు చాలా ఉంటాయి. ఎప్పుడైతే విదేశాల్లో ఉండే అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటున్నారో డిటెక్టివ్ ఏజెంట్ సహాయం తీసుకుని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కచ్చితంగా చేయవచ్చు.
అందరూ మగవారు ఒకే విధంగా ఉండరు. కొంతమంది ఎంతో శాడిస్టిక్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు. మరి కొందరికి ఇతర ఆడవారితో సంబంధాలు ఉంటాయి, అంతే కాదు కొంత మంది మగవారు ఇతర మగవారితో సంబంధంలో ఉండడానికి ఇష్టపడతారు. ఇలాంటి సంఘటనలు మీరు ఎదుర్కొన్నట్లు అయితే మీరు అమెరికాలో ఉండే మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
చాలా మందికి విదేశాల్లో తెలియనటువంటి చట్టాలు ఎన్నో ఉన్నాయి. విదేశాల్లో మీకు ఎటువంటి సమస్య వచ్చినా సోషల్ వర్కర్స్ మరియు పోలీసులకు ఒక ఫోన్ చేయడం వల్ల మీకు ఉచితంగా కౌన్సిలింగ్, లాయర్స్ సహాయం దొరుకుతుంది. అదే విధంగా మీ సమస్యను పరిష్కరించడానికి వారు ప్రయత్నిస్తారు.
ఒకవేళ మీకు మీ భర్తతో గొడవ అయినప్పుడు ఇంటి నుండి వెళ్లిపోవాలి అనుకుంటే అక్కడ షెల్టర్ హోమ్స్ ఉంటాయి, తిరిగి మీరు ఒక దారిని పొందే వరకు షెల్టర్ హోమ్స్ లో ఉచితంగా నివాసం ఉండవచ్చు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు డాక్టర్ మరియు పోలీస్ నుండి రిపోర్ట్స్ సేకరించి ప్రభుత్వానికి ఇవ్వడం వల్ల గ్రీన్ కార్డు కూడా పొందవచ్చు. కానీ వారికి అబద్ధాలు చెబితే ఖచ్చితంగా జైల్లో పెడతారు.
featured image source: shaadi.com
End of Article