నిద్ర విషయంలో ఈ నియమాలు అనుసరించకపోతే ఇబ్బందులు వస్తాయట…!

నిద్ర విషయంలో ఈ నియమాలు అనుసరించకపోతే ఇబ్బందులు వస్తాయట…!

by Megha Varna

Ads

మన ఆరోగ్యం కూడా నిద్ర మీద ఆధారపడి ఉంది. మనం నిద్ర విషయంలో కూడా కొన్ని రూల్స్ ని ఫాలో అవుతూ ఉండాలి. రోజూ సరైన సమయానికి నిద్రపోవడం, సరైన సమయానికి లేవడం చాలా ముఖ్యం. నిజానికి మన జీవనశైలిలో నిద్ర కూడా ఒకటి కాబట్టి నిద్ర విషయం పట్ల తప్పక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Video Advertisement

మనం నిద్ర పోయినప్పుడు ఎన్నో లాభాలు మనకి కలుగుతాయి. మనం నిద్ర పోయినప్పుడు జీవక్రియ సరిగా పనిచేస్తుంది.

అలానే నరాల వ్యవస్థ కూడా బాగుంటుంది, ఒకవేళ కనుక నిద్రపోలేకపోయినా, నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నా ఇటువంటి వాటి పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలా ప్రభావం పడితే అనారోగ్య సమస్యలు వాస్తు ఉంటాయి. మానసిక సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.

బాగా నిద్ర పోవాలంటే ఇలా చేయండి:

#1. స్క్రీన్లకు దూరంగా ఉండాలి:

మనం మంచిగా నిద్ర పోవాలంటే త్వరగా ఇంటి పనులు ముగించుకుని ఆ తర్వాత బెడ్ రూంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అంతేకానీ రాత్రి అవుతున్నా ల్యాప్టాప్లకి, ఫోన్లకి అతుక్కుని కూర్చోకూడదు. వీటి వలన నిద్రలేమి సమస్య వస్తోంది.

#2. కెఫిన్ కి దూరంగా ఉండండి:

నిద్ర పోవడానికి 10 గంటల ముందు మాత్రమే కెఫిన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. అది మీ నిద్ర పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అరుగుదల విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక నిద్ర పోవడానికి మూడు గంటల ముందే మీరు ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండండి. ఆ తర్వాత తీసుకోవద్దు.

నిద్ర వలన ఇన్ని లాభాలు కలుగుతాయి కాబట్టి ఎప్పుడూ కూడా నిద్ర కి ప్రయారిటీ ఇవ్వడం మర్చిపోకండి. సరైన నిద్ర లేకపోతే సమస్యలు వస్తాయి కనుక కచ్చితంగా సరైన వేళకు నిద్రపోవడం, మంచిగా ప్రశాంతంగా ఉండడం, సరిపడినంత నిద్ర పోవడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇటువంటి వాటిని కనుక మీరు పట్టించుకోకపోతే వివిధ రకాల సమస్యల బారిన పడాల్సి వస్తుందని గుర్తుంచుకోండి.


End of Article

You may also like