Ads
స్త్రీకి మాతృత్వం అనేది ఒక అద్భుతమైన వరం. ప్రసవం తర్వాత ప్రతి తల్లి తన పూర్వ రూపం రావడానికి ఆసక్తి చూపిస్తుంది. గర్భాధారణ సమయంలో బిడ్డ ఎదుగుదలకై అధిక ఆహారం తీసుకోవడం వల్లగాని, హార్మోన్లలో వచ్చే మార్పులు వల్లగాని బరువు పెరుగుతుంటారు. దీని వలన పొట్ట చుట్టూ పెరిగిన కొవ్వును తగ్గించుకోవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు.
Video Advertisement
పూర్వకాలంలో సహజ ప్రసవం వలన వచ్చే పొట్టకి నడికట్టు అని వస్త్రము చుట్టి పొట్ట కండరాలు బిగిసి యథాస్థానానికి తీసుకువచ్చేవారు. ఇప్పటి రోజుల్లో ఎక్కువ శాతం సిజేరియన్ డెలివరీ జరగడం వలన పొట్ట కండరాలు వదులుగా మారి యథాస్థానానికి రాలేకపోతుంది.
మరి ఇలా సాగిన పొట్టను తిరిగి మళ్ళీ యథాస్థానానికి తిరిగిరావాలి అంటే ఆహారంలో ఈ అద్భుతమైన చిట్కాలను పాటించండి.
#1. శొంఠి :
ఒక యాభై గ్రాముల శొంఠి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, కొంచెం సువాసన వచ్చేవరకు చిన్న మంట మీద మందపాటి కళాయిలో వేపుకోవాలి. ఇలా వేపిన శొంఠిని చల్లబడిన తరవాత అరచెంచా రాళ్ల ఉప్పు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. పావుచెంచా శొంఠి పొడిని మరియు ఒక చెంచా నెయ్యి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం లో మొదటి ముద్దలో కలుపుకొని తీసుకోవాలి.
#2. మెంతులు :
ఒక లీటర్ నీటిలో 3 చెంచాల మెంతులను రాత్రి మొత్తం నానబెట్టి, మరుసటి రోజు వడగట్టుకోవాలి. ఆ మెంతుల నీటిని కొంచెం కొంచెంగా తాగుతుండాలి. ఈ మెంతులు నీటిలో ఉండే మంచి ఫైబర్ మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తొలగించి, పొట్ట దగ్గర కొవ్వు కరగడానికి సహకరిస్తుంది
#3. పసుపు కలిపి పాలు :
ఒక గ్లాసుడు పాలల్లో పావు చెంచా పసుపు కలుపుకొని రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాలి. ఈ పసుపు కలిపిన పాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి పొట్ట దగ్గర కొవ్వు కరగడానికి సహకరిస్తుంది.
#4. గోరువెచ్చని నీరు:
కాసి చల్లార్చిన గోరువెచ్చని నీటిని భోజనానికి అరగంట ముందు భోజనం అయిన అరగంట తర్వాత తీసుకోవడం ద్వారా మన శరీరంలోనే టాక్సిన్స్ పోయేలాగా చేస్తుంది.
#5. మర్దన :
నువ్వుల నూనెను గోరువెచ్చగా వేడి చేసుకుని, ఆ నూనెను పొట్టపై మర్ధన చేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. డెలివరీ తర్వాత సాగిన పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది.
ఈ టిప్స్ పాటించండి ద్వారా మీ పొట్ట తిరిగి మునుపటి స్థితికి వస్తుంది.
End of Article