Ads
సాధారణంగా వర్షాకాలం అంటే జాగ్రత్తగా ఉండాలి. అసలు మామూలుగానే ఈ సమయంలో ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తున్నాం. ఇంక వర్షాకాలం అంటే మాత్రం ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో ఏ వ్యాధి అయినా సరే తొందరగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి.
Video Advertisement
వర్షాకాలంలో మనం తీసుకోవలసిన ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సాధారణ వాతావరణం ఉన్నప్పటికంటే, చలి వల్ల జీర్ణక్రియ మారుతూ ఉంటుంది. దాంతో అరుగుదల తగ్గి డైజషన్ కి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం కూడా ఎంతో అవసరం. వర్షాకాలంలో తీసుకోవలసిన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
# ఈ కాలంలో బయట ఆహారానికి దూరంగా ఉండడమే మంచిది. ఇంట్లో చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పసుపు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటివి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా నిమ్మరసం లాంటివి కూడా తాగుతూ ఉంటే ప్రయోజనం ఉంటుంది.
# నారింజ కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
# పెరుగు కూడా ఎక్కువగా తినాలి. ఏ కాలమైనా సరే పెరుగు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. వీటితో పాటు ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి.
# కషాయం లేదా హెర్బల్ టీ తరచుగా తీసుకుంటూ ఉండాలి. తులసి, అల్లం, దాల్చిన చెక్క, పసుపు, నల్ల ఉప్పు నీటిలో వేసి, మరిగించి, దాంట్లో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే ఆరోగ్య సమస్యలు దగ్గరికి కూడా రావట.
# ఈ కాలంలో ఎక్కువగా లభించే పదార్థం మొక్కజొన్న కండె. దీని వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందట. ఎందుకంటే మొక్కజొన్నలో తక్కువ కేలరీలు ఉంటాయి. ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీని వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మొక్కజొన్న ని ఉడికించి అయినా తినవచ్చు. లేదా కాల్చుకొని కూడా తినవచ్చు.
End of Article