హార్ట్ ఎటాక్ బ్రెయిన్ స్ట్రోక్ నుండి తప్పించుకోవాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి….!

హార్ట్ ఎటాక్ బ్రెయిన్ స్ట్రోక్ నుండి తప్పించుకోవాలంటే ఈ ఆహారాలు తీసుకోవాలి….!

by Mounika Singaluri

Ads

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ తో మరణిస్తున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు వచ్చి చనిపోయే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. గుండెపోటు కి అనేక కారణాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైన కారణం రక్తం చిక్కబడటం, రక్తనాళాలు గడ్డ కట్టడం.

Video Advertisement

రక్తం చెక్కభజన ద్వారా హార్ట్ ఎటాక్  వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. అయితే రక్తం గడ్డ కట్టడం చిక్కబడటం వంటి సమస్యలు ఉన్నవారు కొన్ని ఆహార పదార్థాల ద్వారా రక్తాన్ని పలుచబరుచుకోవచ్చు. ఏ ఆహార పదార్థాలు తింటే రక్తం పలుచబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం…!

1.అల్లం:

ఆయుర్వేదంలో అల్లానికి అధిక ప్రాధాన్యత ఉంది.ఇది జింజెరోల్స్ అనే సహజ శోథ నిరోధక సమ్మేళనాలుంటాయి. జింజెరోల్స్ వల్ల ప్లేట్లెట్ సమీకరణ తగ్గుతుంది. తద్వారా రక్తం పలుచబడుతుంది. రక్త ప్రసరణ ఆరోగ్యకరంగా ఉంటుంది.

2.పసుపు:

పసుపు నీ యాంటీబయోటిక్ గా వాడుతారు. భారతీయ వంటకాల్లో తప్పనిసరిగా వేసే పదార్థం పసుపు. ఇందులో కర్కుమిన్ అనే ముఖ్యమైన మూలకం ఉంటుంది. కర్కుమిన్‌లో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. దీనివల్ల రక్తంలో గడ్డలు ఏర్పడకుండా శరీరంలో రక్తప్రసరణ కూడా బాగుంటుంది.

3.విటమిన్ c:

విటమిన్ సి ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మన్న శరీరానికి చాలా ఉపయోగాలు ఉంటాయి. అందువల్ల నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష, కివి వంటి సిట్రస్ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ పండ్లలో విటమిన్ సితో పాటు బయోఫ్లవనాయిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ శరీరంలోని కణాల గోడలను బలోపేతం చేస్తాయి. రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది.

4.గ్రీన్ టీ:

ఈమధ్య చాలామంది ఎక్కువగా గ్రీన్ టీ తాగుతున్నారు.గ్రీన్ టీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో ఉండే కాటెచిన్ అనే మూలకం రక్తాన్ని పలుచగా చేసి అందులో గడ్డలు ఏర్పడకుండా నివారిస్తుంది. రక్తాన్ని గడ్డకట్టించే ప్రధాన ప్రోటీన్లైన ఫైబ్రినోజెన్, థ్రాంబిన్లను కాటెచిన్స్ నిరోధిస్తాయి. గ్రీన్ టీ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కణాలలో రక్త ప్రవాహం కూడా మెరుగుపడుతుంది.

ముఖ్యంగా ఈ పదార్థాలు తీసుకోవడం ద్వారా రక్తం పలుచబడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


End of Article

You may also like