Ads
సాధారణంగా మనకి ఉద్యోగం అనగానే సడన్ గా, కంప్యూటర్ ముందు కూర్చుని చేసే జాబ్ లేదా అలాగే 9-5 ఉండే ఏదైనా జాబ్ స్ట్రైక్ అవుతుంది. కానీ ప్రపంచంలో ఎన్నో రకాల ఉద్యోగాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాలు వినడానికి డిఫరెంట్ గా ఉంటాయి. ఇటీవల ఒక బిస్కెట్ కంపెనీ వాళ్ళు తమ బిస్కెట్లను టెస్ట్ చేయడానికి ఒక ఉద్యోగిని నియమించుకున్నారు.
Video Advertisement
ఆ ఉద్యోగి పని బిస్కెట్లు తిని అవి ఎలా ఉన్నాయో చెప్పాలి. ఇది వినగానే “ఏంటి ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయా?” అని అనిపిస్తుంది. ఇలాంటి ఉద్యోగాలు చాలానే ఉంటాయి. ఇటీవల ఒక సంస్థ ఒక డిఫరెంట్ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.
బెడ్ రూమ్ అథ్లెటిక్స్ అనే ఒక యూకే కి చెందిన కంపెనీ తమ కంపెనీలో తయారుచేసిన ఫుట్ వేర్ ని వేసుకొని పరీక్షించడానికి ఒక ఫిమేల్, మేల్ ఉద్యోగులు కావాలి అనే ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు ఒక రోజులో 12 గంటల పాటు, నెలలో రెండు సార్లు ఆ కంపెనీ ఫుట్ వేర్ ని ధరించి టెస్ట్ చేయాలి.
ఇందుకోసం ఆ కంపెనీ నెలకి £333 అంటే భారత కరెన్సీ ప్రకారం 33,292 రూపాయలను చెల్లించనుంది. ఆ ఇద్దరు ఉద్యోగులు బెడ్ రూమ్ అథ్లెటిక్స్ వాళ్లు తయారు చేసిన స్లిప్పర్స్, స్లీపర్ బూట్స్, లాంజ్ వేర్, హోమ్ వేర్ వంటి వివిధ రకాల ఫుట్ వేర్ ధరించి అవి ఎలా ఉన్నాయో అనే దానిపై రివ్యూ ఇవ్వాలి. జనవరి 31వ తేదీ వరకు ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చు.
End of Article