Chankaya Neethi: పిల్లలు ఉన్నతులు కావాలంటే ఈ మూడింటినీ అస్సలు మరచిపోకండి..!

Chankaya Neethi: పిల్లలు ఉన్నతులు కావాలంటే ఈ మూడింటినీ అస్సలు మరచిపోకండి..!

by Megha Varna

Ads

పిల్లలని మంచి స్థాయిలో చూడాలని ఏ తల్లిదండ్రులకి ఉండదు..? పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు విద్యాభ్యాసం మొదట తల్లిదండ్రులు నుంచి మొదలవుతుంది. అందుకనే తల్లిదండ్రులు పిల్లల జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తారు.

Video Advertisement

 

అలాగే తల్లిదండ్రులని చూసి పిల్లలు అలవాట్లను, ఆచారవ్యవహారాలను అనుసరించడం మొదలు పెడతారు. తల్లిదండ్రులు ఎలా అయితే పెంచుతారో.. అదే వాళ్ళ భవిష్యత్తుకు పునాదని మనం చెప్పొచ్చు.

Chanakya Niti For Enemies Keep These Things In Mind To Win Over The Enemy - Chanakya Niti : शत्रुओं पर विजय पाने के लिए आचार्य चाणक्य की इन बातों को रखें ध्यान -

ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల యొక్క విషయంలో శ్రద్ధ వహించాలి. పిల్లలు మంచి మార్గాన్ని ఎంచుకుంటున్నారా, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది గమనిస్తూ సరిచేస్తూ వాళ్లని అభివృద్ధి చేయాలి. పిల్లల పెంపకం గురించి ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాలను తెలుసుకోవాలని చాణిక్య చెప్పారు. మరి వాటి కోసం ఎప్పుడూ చూద్దాం.

ఇంటి తాలూక వాతావరణం:

 

పిల్లలు తమ యొక్క వాతావరణాన్ని గమనించి ఏవైనా నేర్చుకోవడం జరుగుతుంది. ఏవైతే మీరు నేర్పిస్తారో అవే వాళ్ళు నేర్చుకుంటారు. ఎక్కువగా గొడవలు వంటివి వాతావరణంలో ఉంటే పిల్లలు కూడా కోపం వంటివి గ్రహించి అలానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు మీ పిల్లల్ని సున్నితంగా, ప్రశాంతంగా ఉండేలా చేయాలనుకుంటే అప్పుడు మీ యొక్క వాతావరణం కూడా ఎంతో ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి.

తల్లిదండ్రుల యొక్క తీరు:

ఏదైనా సరే పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తే వాళ్లు కూడా అదే చేయాలని అనుకుంటారు. అందుకనే తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒకరికొకరు గౌరవం ఇవ్వాలి. మాటలు మధురంగా, వినయంగా ఉండేటట్టు చూసుకోవాలి. వీటిని పిల్లలు అనుసరించడం జరుగుతుంది.

పిల్లల్ని ప్రోత్సహించాలి:

Positive relationships: parents & children | Raising Children Network

ఎప్పుడూ కూడా మీ యొక్క పిల్లల్ని ఎవరితోనూ పోల్చకండి. పిల్లలని అర్థం చేసుకోవడానికి, వాళ్లని ప్రోత్సహించడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీ ప్రోత్సాహం వలన వారు కష్టమైన పనులను కూడా ఈజీగా చేయగలుగుతారు. అందుకని వాళ్ళకి మీరు గొప్ప వ్యక్తుల కథలు మంచి స్పూర్తినిచ్చే విషయాలు వంటివి చెబుతూ ఉండాలి దీనితో వాళ్ళు మంచి నేర్చుకోవడానికి అవుతుంది అని చాణిక్యనీతి చెబుతోంది.


End of Article

You may also like