బాలయ్య బాబు, బోయపాటి శ్రీను కాంబో అంటే అది ఎవర్ గ్రీన్. వీరిద్దరి కాంబో లో వచ్చిన లెజెండ్, సింహ సినిమాలు ఇప్పటికే హిట్ అయ్యాయి. మరో సారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండడం తో రాబోయే సినిమా పై అంచనాలు తారాస్థాయి కి చేరుకున్నాయి. తాజాగా, వీరిద్దరి కాంబో లో రాబోయే సినిమా కి “అఖండ” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ.. ఓ వీడియో ను రిలీజ్ చేసారు.

akhanda 5

ఈ వీడియో లో టైటిల్ తో పాటు బాలయ్యబాబు లుక్ ను కూడా రివీల్ చేసారు. ఈ టీజర్ ను బట్టి “అఖండ” సినిమా లో బాలయ్య బాబు సరికొత్త గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. “అఖండ” టీజర్ లో బాలయ్య ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. “కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది!” అంటూ బాలయ్యబాబు చెప్పే డైలాగ్ ఫాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.

akhanda

ప్రస్తుతం ఈ వీడియో నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ లో బాలకృష్ణ లుక్ పై చర్చలు కూడా జరిగేస్తున్నాయి. బాలయ్యబాబు చెప్పే డైలాగ్స్ ఒక లెవెల్ అయితే, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ లో ఉంది. మొత్తానికి ఈ టీజర్ ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత పెంచేసింది. అయితే, ఈ టీజర్ లో ఈ నాలుగు విషయాలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

akhanda 3

#1 ఈ టీజర్ ప్రారంభం లో బాలకృష్ణ రుద్రాక్ష మాలను పట్టుకుంటారు. సాధారణం గా రుద్రాక్ష దండలు మొత్తం రుద్రాక్షలతోనే కట్టబడి ఉంటాయి. కానీ, బాలయ్యబాబు పట్టుకునే రుద్రాక్ష దండకి మధ్యలో శివలింగం లాకెట్ లాగా ఉంటుంది.

akhanda 2

#2 అలాగే బాలయ్యబాబు నుదిటిన విభూతి తిలకం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. చాలామంది శైవులు మూడు అడ్డ విభూతి నామాలు పెట్టుకుంటారు. అదే వైష్ణవులు నిలువు తిలకం నామం పెట్టుకుంటారు. కానీ బాలయ్యబాబు రెండు కలిపి పెట్టుకుని కనిపిస్తారు. విభూతి నామాలు అడ్డంగా ఉండి, వాటిపై నిలువు తిలకం నామం కనిపిస్తుంది.

akhanda 1

#3 ఇంకో విషయం ఏమిటంటే.. త్రిశూలం కూడా డిఫరెంట్ గానే ఉండడం. సాధారణం గా మూడు శూలాలు ఉంటాయి కాబట్టే దానిని త్రిశూలం అంటారు. కానీ బాలయ్య పట్టుకున్న త్రిశూలానికి మాత్రం ఐదు శూలాలను మనం చూడవచ్చు.

akhanda

 

#4 ఇక నాలుగోది ఏంటి అంటే.. బాలయ్యబాబు గడ్డం. ఆయన జుట్టు మీసాలు మాత్రం యంగ్ ఏజ్ లో ఉన్నవారికి లాగ నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. కానీ, గడ్డం మాత్రం బాగా పడిపోయినట్లు కనిపిస్తుంది. అయినా.. అభిమానులకు బాలయ్యబాబు ఎలా ఉన్నా నచ్చేస్తారు అనుకోండి..అది వేరే విషయం.


ఇక ఇంటినుంచి ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించండి - CLICK   HERE