చాణక్య నీతి ప్రకారం పురుషులు ఈ 4 విషయాలను ఇతరులతో పంచుకోకూడదట.! భార్య కి సంబందించిన రహస్యం మస్ట్.!

చాణక్య నీతి ప్రకారం పురుషులు ఈ 4 విషయాలను ఇతరులతో పంచుకోకూడదట.! భార్య కి సంబందించిన రహస్యం మస్ట్.!

by Mohana Priya

Ads

చాణుక్యుడు భారతీయులందరికి సుపరిచుతుడే. అర్ధశాస్త్రాన్ని ఔపోసన పట్టి, సకల రాజనీతి జ్ఞానాన్ని సముపార్జించిన వాడు చాణుక్యుడు. అర్ధశాస్త్రాన్ని రచించింది ఈయనే అని మనకి తెలిసినదే. ఈయన రచయితగా, సలహాదారునిగా ఎనలేని ఖ్యాతి గడించారు.

Video Advertisement

ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. ఈయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఆచరించుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.

chanakya nithi

#1. చాణుక్యుడు చెప్పిన నీతి సూత్రాల ప్రకారం.. పురుషుడు ఆర్ధిక పరంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవ్వరికి చెప్పకూడదట. ఒకవేళ చెబితే, ఆ వ్యక్తికీ ఇతరులెవ్వరు సాయం చెయ్యరట. ఒకవేళ ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వచ్చినా అది అబద్ధమేనట. మనస్పూర్తి గా ఎవరు సాయం చేయరట.

four secrets to not to tell anyone according to chanakya

#2. అలాగే, వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఎవ్వరికి చెప్పకూడదట. ఎందుకంటే అర్ధం చేసుకునే వారికంటే.. అపహాస్యం చేసే వారే ఎక్కువమంది ఉంటారట. దీనివలన ఆత్మనూన్యతా భావాలు ఎక్కువ అవుతాయట. కాబట్టి మన బలహీనతల గురించి ఇతరులకు చెప్పకపోవడమే మంచిది.

Sad incident in padamatalanka

representative image

#3. ఇంకా చాణుక్యుడు ఏమి చెప్పాడంటే.. ఏ పురుషుడు అయినా తన భార్య రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదట. దానివల్ల భవిష్యత్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య గురించి రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి.

Things that a mother should tell her son before getting married

#4. అలాగే ఎవరైనా ఎప్పుడైనా అవమానానికి గురి అయినా.. ఆ విషయాన్నీ అక్కడితో వదిలేయాలట. అది ఎవరితో అయినా పంచుకున్నా వారు దానిని హాస్యమాడితే మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని వలన మరింత బాధ ఎక్కువ అవుతుంది. కాబట్టి, మనకు జరిగిన అవమానాలను ఎవరితోనూ పంచుకోకపోవడమే ఉత్తమం.

four secrets to not to tell anyone according to chanakya


End of Article

You may also like