మీ కళ్ళలో ఈ 4 మార్పులు కనిపిస్తే చాలా ప్రమాదం.. అవి ఇవేనా..?

మీ కళ్ళలో ఈ 4 మార్పులు కనిపిస్తే చాలా ప్రమాదం.. అవి ఇవేనా..?

by Sunku Sravan

Ads

మానవుని శరీరంలో అతి సున్నితమైన శరీర అవయవాల్లో కళ్ళు ఒకటి. అందుకే కళ్ళను మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అన్ని రోజులు మనకు చూపునిస్తాయి..? ఇదే కాకుండా కళ్ల ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుందో కూడా కనిపెట్టవచ్చు అని బ్రిటన్లోని ఆంగ్లేయ రస్కిన్ యూనివర్సిటీ రీసెర్చ్ విభాగం ప్రొఫెసర్ బార్బరా కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. మనం టెస్టులు చేయించుకోకుండానే కళ్లను చూసి అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని గుర్తించవచ్చని తెలియజేశారు.

Video Advertisement

#1 కనుపాప పరిమాణం
ఆస్పత్రికి వెళ్లినప్పుడు కళ్ళలోకి లైట్ వేసి డాక్టర్ చెక్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. అలా ఎందుకు చేస్తారో తెలుసా కనుపాప వెలుతురుకు తక్షణమే స్పందిస్తుంది. ప్రకాశవంతమైన వాతావరణంలో కనుపాప చిన్నదిగా అవుతుంది. వెలుతురు తగ్గే కొద్దీ పెద్దదవుతుంది. ఈ ప్రక్రియ నెమ్మదిగా జరిగినట్లయితే కనుపాప అనారోగ్యానికి గురి అయిందని అర్థం. దీని ద్వారా అల్జీమర్స్ వంటి వ్యాధులు ఇతరాత్ర అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. మాదక ద్రవ్యాలు ఉపయోగించే వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

#2 ఎరుపు రంగులోకి మారితే
కంటిలోని తెల్లగుడ్డు రంగు బారడం కూడా మన శరీరంలో తేడా ఉందనేది సంకేతం కావచ్చు. కళ్ళు బాగా ఎరుపెక్కి కనిపించినట్లయితే, అధిక మోతాదులో మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకున్న దానికి సంకేతం కావచ్చు. కళ్ళల్లో నలత లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కూడా కళ్లు ఎర్రగా మారతాయి. కానీ ఈ సమస్య చాలావరకు కొద్దిరోజులకే తగ్గిపోతుంది. ఒకవేళ కళ్ళు రంగుమారి ఎక్కువ కాలం అలాగే ఉంటే మాత్రం అది ఇన్ఫెక్షన్ గా భావించాలి.

#3 తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారితే
కంటిలోని తెల్లగుడ్డు పసుపు రంగులోకి మారితే మాత్రం జాండీస్ అంటారు. అంటే కామెర్ల జబ్బుకు సంకేతం. మన కాలేయానికి జబ్బు సోకింది అనేది చూపిస్తుంది. కామెర్లు సోకడానికి చాలా కారణాలు ఉంటాయి. కాలేయం వాపు అనేది జన్యుపరంగా కూడా రావచ్చు.

#4 ఎరుపు చార
కంటి తెల్ల గుడ్డ మీద ఎర్రటి రక్తపు చార ఉంటే అక్కడ రక్తనాళం చిట్లింది అనేది సంకేతం. ఈ పరిస్థితికి చాలా సందర్భాల్లో కారణాలు తెలియవు. కొన్ని రోజుల్లోనే అది కనిపించకుండా పోతుంది. అధిక రక్తపోటు గానీ మధుమేహానికి కానీ ఇది సూచిక కావచ్చు.

 


End of Article

You may also like