Ads
గర్భిణీలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గర్భిణీలు కనుక జాగ్రత్తగా ఉండకపోతే పిల్లల్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. గర్భిణీలు తీసుకునే ఆహారం మొదలు ఉపయోగించే మందులు వరకు ప్రతి దానిలో కూడా శ్రద్ధ పెట్టాలి. ఇష్టం వచ్చినట్లు తీసుకుంటే ప్రమాదం తప్పదు.
Video Advertisement
గర్భిణీలు తీసుకొనే డైట్ లో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండాలని మనకు తెలిసిందే ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. పండ్లు తినే ముందు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి దీనికి గల ముఖ్య కారణం ఏమిటంటే పండించేటప్పుడు పురుగుల మందులు వేయడం..
రైతులు పురుగుల మందు జల్లుతూ వుంటారు. అటువంటి సమయంలో గర్భిణీలు వీటిని తీసుకోవడం వలన ప్రమాదం కలుగుతుంది.
ఈ ఆహారపదార్దాలకు దూరంగా ఉండాలి:
#1. నారింజ పండు, అవకాడో వంటి వాటిపై తక్కువ పురుగుల మందులు మాత్రమే జల్లుతారు. కనుక పరవాలేదు. కానీ ఎక్కువగా ఆపిల్స్, స్ట్రాబెర్రీస్ వంటి వాటిపై పురుగుల మందులను స్ప్రే చేస్తారు. కనుక ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి లేదంటే బిడ్డకు కూడా ప్రమాదం కలుగుతుంది. ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువే ఉంటుంది.
#2. అలానే బచ్చలి కూర, మిరియాలు, ద్రాక్ష లాంటి వాటిపై ఎక్కువ పురుగుల మందు జల్లుతూ ఉంటారు అందుకని వీటిని కూడా తక్కువ తీసుకోవడం మంచిది. లేదంటే పూర్తిగా మానేసినా పరవాలేదు.
#3. పురుగుల మందు ఎక్కువ స్ప్రే చేసే కూరగాయలు పండ్లు తింటే గర్భం దాల్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కేవలం ఆడవాళ్ళలోనే కాదు మగవారిలో కూడా సంతానోత్పత్తి కి సంబంధించిన సమస్యలు కలుగుతాయి.
ఎలాంటి సమస్యలు వస్తాయి..?
చనిపోయిన పిల్లలు పుట్టడం, సంతానోత్పత్తి తగ్గడం, సడెన్ గా అబార్షన్ అవ్వడం, తక్కవ బరువుతో పిల్లలు పుట్టడం, పుట్టుకతో లోపాలు లేదంటే గర్భం రాక పోవడం ఇలాంటి సమస్యలు పురుగుల మందు వంటి వాటి వలన వస్తాయి. కనుక ఆర్గానిక్ పండ్లను, కూరగాయలను తీసుకోవడం మంచిది.
End of Article