ఉప్పెన సినిమా తో “కృతి శెట్టి” ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ సినిమాలో కృతి శెట్టి కి మదర్ గా నటించిన గాయత్రీ జయరామన్ కు కూడా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తో ఆమె గట్టి కమ్ బ్యాక్ నే ఇచ్చారు. కమ్ బ్యాక్ ఏంటా..? అని అనుకుంటున్నారా..? బేబమ్మ మదర్ గాయత్రీ గతం లో కూడా సినిమాల్లో నటించారు. ఆమె టాలీవుడ్ హీరో శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా కూడా చేసారు.

gayathri jayaraman 2

వాస్తవానికి “ఉప్పెన” సినిమాలో గాయత్రి జయరామన్ పాత్ర చాలా చిన్నది. పెద్ద డైలాగ్స్ కూడా ఉండవు. కానీ.. ఆమె హావభావాలే అందరిని ఆకట్టుకున్నాయి. ఆమె గతం లో కూడా సినిమాలలో నటించారు అన్న సంగతి చాలా మందికి తెలియదు. 2001 లోనే “నీలా” అనే కన్నడ సినిమా ద్వారా ఆమె ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. కాన్సర్ వ్యాధి తో బాధపడిన లేడీ సింగర్ కధనం తో ఈ సినిమా తెరకెక్కింది.

gayathri

2002 వ సంవత్సరం లో శ్రీకాంత్ హీరో గా వచ్చిన “ఆడుతూ పాడుతూ” సినిమాలో గాయత్రి గా నటించి మెప్పించింది. ఇది కాకుండా మరొక సినిమాలో కూడా ఆమె నటించారు. ఆకాష్ హీరో గా నటించిన “నాయుడు LLB ” చిత్రం లో కూడా నటించారు. ఈ సినిమాలు ఆమెకు బ్రేక్ ఇవ్వలేదు. సినిమాలకు గ్యాప్ రావడం తో.. ఆమె 2007 లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసారు.

gayathri jayaraman

#